సల్మాన్ ను కలిసేందుకు సైకిల్ పై 600 కి.మీ. ప్రయాణం

తన అభిమాన హీరో ను కలవడానికి ఓ వ్యక్తి సైకిల్ పై 600 కి.మీ.లు ప్రయాణించాడు. అస్సాంలోని టిన్సుకియాకు చెందిన భూపెన్ లిక్సన్(52) బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు వీరాభిమాని. సైక్లిస్ట్ అయిన భూపెన్ లిక్సన్ ఫిబ్రవరి 8 న తన స్వస్థలం జగూన్ పట్టణం నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించి, ఫిబ్రవరి 13 న గౌహతి చేరుకున్నాడు.  గౌహతిలో రేపు(శనివారం) జరగనున్న ఫిలింఫేర్ అవార్డులకు సల్మాన్ ఖాన్ హాజరవుతున్నాడని తెలిసి..ఈ సైకిల్ యాత్ర చేపట్టినట్లు భూపెన్ తెలిపాడు.

52 ఏళ్ల భూపెన్ ఇప్పటికే హ్యాండిల్స్‌ను తాకకుండా 60 నిమిషాల్లో 48 కిలోమీటర్లు సైక్లింగ్ చేసినందుకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుకున్నాడు.

Latest Updates