విజయవాడలో దారుణం: కోరిక తీర్చలేదని గొంతుకోశాడు..

విజయవాడ: తన కోరిక తీర్చలేదన్న కోపంతో ఓమహిళ గొంతుకొశాడు ఒక దుండగుడు. ఈ ఘటన విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగింది. విజయవాడలోని మొగల్రాజపురం కొండపై రామలక్ష్మి అనే మహిళ చుట్టు పక్కల ఉన్న ఇండ్లలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తుంది. అదే ప్రాంతంలో నాగేశ్వర రావు అనే వ్వక్తి తరచూ తనతో సహజీవనం చేయాలని వేధించసాగాడు.. అయితే తనకు పిల్లలు ఉన్నారని అటువంటి వాటికి తను ఒప్పుకోనని తేల్చి చెప్పింది.

దీంతో రామలక్ష్మిపై కక్ష పెంచుకున్న నాగేశ్వరరావు ఆమెను చంపేందుకు ప్లాన్ వేశాడు.  పాత ఐదో నెంబర్ రూట్ లోని ఇండ్లలో పని చేయడానికి వస్తుందని తెలుసుకున్న నాగేశ్వరరావు ఆమెను చంపడానికి రెడీ అయ్యాడు. గురువారం సాయంత్రం అదే గల్లీలోకి పనికి వెళ్లిన రామలక్ష్మిని కొంబరిబొండాల కత్తితో దాడి చేశాడు. ఆమె గొంతును కోశాడు. రామలక్ష్మి గట్టిగా అరవడంతో చుట్టుపక్కలవాళ్లు అతన్ని గుంజిపడేశారు. రామలక్ష్మికి మెడపై గాయమై రక్తం చాలాపోవడంతో  హాస్పిటల్ కు తీసుకెళ్లారు స్థానికులు. పోలీసులకు సమాచారం ఇవ్వగా నాగేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తన కోరిక తీర్చకపోవడంతోనే రామలక్ష్మిపై దాడి చేసినట్లు చెప్పాడు.

Latest Updates