చాలా ఇబ్బందులు పడ్డ..అందుకే హార్దిక్ ను కొట్టా

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్ పై ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చాడు తరుణ్ గజ్జర్. ‘పటిదార్ ఉద్యమ సమయంలో నా భార్య ప్రెగ్నెంట్. ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నప్పుడు ఉద్యమం నడుస్తుంది. అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డ. ఎలాగైనా హార్దిక్ పటేల్ ను కొట్టాలని అప్పుడే అనుకున్నా‘ అని తరుణ్ గజ్జర్ చెప్పారు.

గుజరాత్ లోని సురేంద్ర నగర్లో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా హార్దిక్ పటేల్ పై తరుణ్ గజ్జర్ సడెన్ గా వచ్చి స్టేజ్ పై ఉన్నహార్దిక్ టేల్ ను చెంపపై కొట్టాడు. తర్వాత అక్కడున్న కాంగ్రెస్ నేతలు తరుణ్ ను పట్టుకుని కొట్టారు. గాయాలైన తరుణ్ ను ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సందర్భంగా హార్దిక్ పటేల్ ను ఎందుకు కొట్టాల్సి వచ్చిందో మీడియాకు వివరించాడు తరుణ్.

Latest Updates