లాస్ ఏంజిలిస్​లో మోసగాళ్లు

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న హాలీవుడ్-ఇండియన్ ప్రొడక్షన్ ‘మోసగాళ్లు’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తనకి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణను ఇటీవలే ప్రారంభించాడు విష్ణు. ప్రపంచపు ఎంటర్​టెయిన్​మెంట్ క్యాపిటల్​గా ప్రసిద్ధి పొందిన లాస్ ఏంజిలిస్​​లో తీస్తున్న ఇంపార్టెంట్ సీన్లలో పాల్గొంటున్నాడు. నియాన్ లైట్లతో వెలిగిపోయే ఈ నగరం ‘మోసగాళ్లు’కు సరిగ్గా సరిపోయే నేపథ్యాన్ని అందిస్తోందట. పది రోజుల పాటు ఇక్కడే షూటింగ్ జరగనుంది. చరిత్రలో అతి పెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఈ సినిమా ఛేదిస్తుంది. కాజల్, సునీల్ శెట్టి ఇద్దరూ రెండు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. నవదీప్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంటోంది. జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాను వేసవిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Latest Updates