అసెంబ్లీని వాయిదా వేసి… వైన్స్ ను ఎందుకు మూస్తలేరు?

అసెంబ్లీని వాయిదా వేసి…వైన్స్ ను ఎందుకు మూస్తలేరు?
కేసీఆర్ నిర్ణయాలు కరోనా కంటే ప్రమాదం: మందకృష్ణ

సైఫాబాద్ (హైదరాబాద్), వెలుగు: సీఎం కేసీఆర్ నిర్ణయాలు కరోనా వైరస్ కంటే ప్రమాదకరంగా ఉన్నాయని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్య వేదిక చైర్మన్ మందకృష్ణ మాదిగ విమర్శించారు. కరోనా చర్యల విషయంలోనూ సీఎం వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన ఆదర్శ్ నగర్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీడియాతో మాట్లాడారు. స్కూళ్లు మొదలుకొని యూనివర్సిటీల వరకు బంద్ చేసిన సీఎం… అంగన్వాడీలను మాత్రం ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. సినిమాహాళ్లు, పబ్బులు, బార్లు బంజేసి.. వైన్స్ ను మాత్రం ఎందుకు కొనసాగిస్తున్నారని నిలదీశారు. బార్లు మూసేయడంతో అందరూ వైన్స్ కే వెళ్తారని, అక్కడ వైరస్ సోకదా? అని ప్రశ్నించారు. ఈ నెల 20 వరకు కొనసాగాల్సిన అసెంబ్లీ సమావేశాలను అర్ధాంతరంగా వాయిదా వేశారని… సీఎంకు ప్రజాప్రతినిధులపై ఉన్న ప్రేమ సామాన్య ప్రజలపై లేదని విమర్శించారు.

వెంటనే వైన్ షాపులను బంజేయాలని, లేని పక్షంలో ఈ నెల 20 నుంచి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కరోనాకు పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందన్న సీఎంకు ఇంత భయం ఎందుకు పట్టుకుందని ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. నారాయణ , చైతన్య విద్యాసంస్థలకు ఎందుకు మినహాయింపునిచ్చారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు
జి.చెన్నయ్య ప్రశ్నించారు.

See Alos: ఫీల్డ్​ అసిస్టెంట్లపై ప్రభుత్వం కఠిన నిర్ణయం

రైతు రుణమాఫీ: అర్హులను ఇలా గుర్తిస్తారు

ఇంటర్​ క్వశ్చన్ ​పేపర్లలో తప్పులే తప్పులు

నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలోకి కవిత

Latest Updates