యాదాద్రి మీద అంత శ్రద్దా..? మేడారం పై ఇంత అశ్రద్ధా..?

ముఖ్యమంత్రి కేసీఆర్ వన దేవతల ఆగ్రహానికి గురవ్వక తప్పదని అన్నారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ.  హామీలతో సీఎం.. దేవతలను కూడా మోసం చేసాడని అన్నారు.

2018 లో మేడారం అభివృద్ధి కోసం 200 కోట్ల రూపాయలు, 200 ఎకరాలు కేటాయిస్తామన్న కేసీఆర్ ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని తానే స్వయంగా గతంలో పీఎం తో మాట్లాడతానని చెప్పారు. పాలనలో వివక్ష, అధికార యంత్రాంగం లో వివక్ష,  చివరకు మా దేవతలపై కూడా కేసీఆర్  వివక్ష చూపుతున్నారు. యాదాద్రి మీద అంత శ్రద్ద ఎందుకో..? మేడారం పై ఇంత అశ్రద్ధ ఎందుకు..?  అని ప్రశ్నించారు.

ఈ నెల 12,13 తేదీలలో ఎస్సి,ఎస్టీ,బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మేడారం, యాదాద్రి లను సందర్శిస్తామని, రెండు ఆలయాల అభివృద్ధి ఎలా జరుగుతున్నాయి పరిశీలిస్తామని మంద కృష్ణ అన్నారు.  తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని చెప్పారు.

Manda Krishna Fires on CM KCR over Negligence on medaram jatara

Latest Updates