రాష్ట్రంలో లిక్కర్ ఏరులై పారుతున్నందుకే దిశపై అఘాయిత్యం: మందకృష్ణ

రాష్ట్రంలో లిక్కర్ ఏరులై పారుతున్నందుకే దిశపై అఘాయిత్యం జరిగిందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. సీఎం కేసీఆర్ చెప్తున్నబంగారు తెలంగాణలో గల్లీగల్లీకి లిక్కర్ షాపులు కొత్తగా పెట్టడం వల్లనే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పారు. శంషాబాద్ లోని దిశా కుటుంబసభ్యులను కలిసి పరామర్శించారు మందకృష్ణ. కేసుల పేరుతో కాలయాపన చేయకుండా నిందితులను తక్షణమే శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకుంటలేదని చెప్పారు. పోలీసు వ్యవస్థ నిర్వార్యం అయిందని అన్నారు.

Latest Updates