15 లక్షల పరిహారం ఇవ్వాలి: మంద కృష్ణ

Manda krishna on Godavari boat crashగోదావరి బోటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను కూడా కట్టించాలన్నారు. పాపికొండల దగ్గర పడవ ప్రమాదాలు జరగకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరామర్శ

బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కుటుంబాలను ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరామర్శించారు. తన నియోజకవర్గంలోని హయత్ నగర్ నుంచి నలుగురు పాపికొండల టూర్ కు వెళ్లారని చెప్పారు. అందులో ఇద్దరు ప్రమాదం నుంచి  క్షేమంగా బయటపడగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారన్నారు. వారి ఆచూకీ తెలుసుకునేందుకు రెస్క్యూ టీమ్స్ ప్రయత్నిస్తున్నాయని అన్నారు.

Latest Updates