మాదిగలకు మంత్రి పదవి ఇవాల్సిందే.. దీక్షలో మందకృష్ణ డిమాండ్

వరంగల్ అర్బన్ :  హన్మకొండ కేడీసీ గ్రౌండ్ లో మాదిగ & ఉపకులాల అభ్యున్నతి కోరుతూ ఒక రోజు మహాదీక్ష చేశారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. పార్టీల నాయకులు, ఎమ్మార్పీఎస్ శ్రేణులు దీక్షకు మద్దతుగా వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మాదిగ & ఉపకులాలకు మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించిందని .. ఇందుకు నిరసనగా మాదిగ ఉపకులల మహాదీక్షను ఒకరోజు చేస్తున్నారు.

శ్రమజీవుల సంపద సృష్టికర్తలైన మాదిగలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం బాధాకరం అన్నారు సీపీఐ మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య. మాదిగ జాతికి మంత్రి పదవి ఇవ్వక పోతే కేసీఆర్ ప్రభుత్వం మూల్యం చెల్లిచక తప్పదని హెచ్చరించారు.

మంద కృష్ణ ఒకరోజు మహా దీక్షకు మద్దతు తెలిపారు మాజీ ఎంపీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్,మాజీ ఎమ్మెల్యే సంపత్, ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి.

దళిత ఎమ్మెల్యేలు కేసీఆర్ కు తొత్తులుగా మారితే .. కన్న తల్లికి ద్రోహం చేసినట్టేనని పొన్నం ప్రభాకర్ అన్నారు. మాదిగలకు మంత్రి పదవి ఇచ్చేవరకు మాదిగలు స్థానిక పోరాటాలు చేయాలన్నారు. నాడు రజాకార్లతో పోరాటం చేసిన ప్రజలు… నేడు కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. భవిష్యత్ లోనైనా మాదిగలకు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Latest Updates