మందేమన్నా నిత్యావసర సరుకా?

హైదరాబాద్ , వెలుగు: లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నప్పుడే వేలల్లో పాజిటివ్ కేసులు, వందల్లో మరణాలు జరుగుతుంటే మద్యం దుకాణాలు ఎట్లా తెరిచారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. వైన్ షాపులు తెరవడం ఏపీ, తెలంగాణ పాలకుల అనైతికతకు నిదర్శనమని ఆరోపించారు. మద్యం తాగితే ఆరోగ్యం పాడవుతుందే తప్ప అదేమీ నిత్యావసర సరుకు కాదని చెప్పారు.

కరోనా సోకకుండా ఉండేందుకు పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పిన రెండు రాష్ట్రాల సీఎంలు..ఇప్పుడు మద్యం షాపులు తెరవడం సరికాదన్నా రు. మద్యపానం వల్లపేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికర్థికంగా చితికిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా బారినపడి చనిపోయినోళ్ల కంటే డ్రంకెన్ డ్రైవ్ కారణంగా జరిగిన యాక్సిడెంట్లలో తోనే ఎక్కువ మంది చనిపోయారన్నారు. మద్యం మత్తులో మర్డ‌ర్లు, రేప్ లు పెరిగే ప్రమాదం ఉందని మందకృష్ణ హెచ్చరించారు.

Latest Updates