కేసీఆర్.. బహిరంగ క్షమాపణ చెప్పాలి : మంద కృష్ణ

హైదరాబాద్ : పీడితవర్గ సమాజంలో అత్యంత మార్పులు తీసుకొచ్చిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు ఎమ్మార్పీఎస్ చీఫ్ మంద కృష్ణ మాదిగ. ఎక్కడా రాజీపడకుండా చేసిన పోరాటాల ఫలితంగానే.. రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్నామని చెప్పారు. ప్రపంచమంతా అంబేద్కర్ ను గౌరవిస్తే.. తెలంగాణలో అవమానపరిచారని విమర్శించారు. మే 8న ఇందిరాపార్క్ దగ్గర నిర్వహించే అంబేద్కర్ వాదుల మహాగర్జన విజయవంతం కోసం సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది ఎమ్మార్పీఎస్.

హిమాయత్ నగర్ లోని బీసీ సాధికారత భవన్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల ప్రజాస్వామిక వాదుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా మంద కృష్ణ మాదిగ హాజరయ్యారు. అంబేద్కర్ జయంతి రోజు కనీసం పూలమాల వేయని కేసీఆర్.. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంద కృష్ణ. అంబేద్కర్ విగ్రహం చెత్తకుప్పలో పడేసిన దానికి నిరసనగా నిర్వహించే సభకు అంబేద్కర్ వాదులంతా హాజరు కావాలని కోరారు మంద కృష్ణ.

Latest Updates