రాష్ట్రంలో నాలుగు కొత్త మండలాలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో కొత్తగా నాలుగు మండలాలు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్‌ ను జారీ చేసింది ప్రభుత్వం. సిద్దిపేట జిల్లాలో నారాయణరావుపేట మండలం, మేడ్చల్‌ జిల్లాలో మూడుచింతలపల్లి మండలం, నిజామాబాద్‌ జిల్లాలోని వర్ని మండలాన్ని పునర్‌ వ్యవస్థీకరించి మొస్రా, చండూరు అనే కొత్త మండలాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు తుది నోటిఫికేషన్‌ ను విడుదల చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Latest Updates