మూడో ర్యాంకులో మంధాన

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళా వన్డేర్యాంకింగ్స్‌ లో ఇండియన్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన మూడో ర్యాంకుకు చేరింది. ఇంగ్లండ్‌ తో జరిగిన సిరీస్‌ లో స్టాండిన్‌ కెప్టెన్‌ గావ్యవహరించిన మంధాన బ్యాటింగ్‌ లో రాణించడంతో 698 పాయింట్లతో థర్డ్‌‌ ప్లేస్‌ లోనిలిచింది. సుజీ బేట్స్‌ (767 పాయింట్లు,న్యూజిలాండ్‌ ), దియాండ్రా డాటిన్‌ (725పాయింట్లు, వెస్టిండీస్‌ ) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. యువ ప్లేయర్‌ జెమీమారోడ్రిగ్స్‌ ఆరో స్థానంలో ఉండగా.. కెప్టెన్‌హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ పదో ర్యాంకు దక్కించుకుంది. భారత బౌలర్లలో పూనమ్‌‌ యాదవ్‌ రెండో ర్యాంకులోనే కొనసాగుతోంది. తొలిస్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన మేగన్‌షుట్‌ ఉండగా.. ఇండియన్‌ లెఫ్టా ఆర్మ్‌‌ స్పిన్నర్‌ రాధా యాదవ్‌ .. షబ్నమ్‌‌ ఇస్మాయిల్‌(దక్షిణాఫ్రికా)తో కలసి జాయింట్‌ గా ఫిఫ్త్‌‌ ప్లేస్‌ దక్కించుకుంది. టీమ్‌‌ ర్యాంకింగ్స్‌ లోభారత్‌ ఐదో ర్యాంకులో కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో 283 పాయింట్లతో ఆస్ట్రేలియా నం.1 ర్యాంకును దక్కించుకుంది. ఇంగ్లండ్‌ 278 పాయింట్లతో రెండోస్థానంలో ఉంది.

Latest Updates