‘మన్మథుడు 2’ : ఇంగ్లీష్ బ్యూటీ ప్రేమలో నాగ్..

రాహుల్‌ రవీంద్రన్‌ డైరెక్షన్ లో కింగ్‌ నాగార్జున హీరోగా నటించిన ‘మన్మథుడు 2’. నాగ్ సరసన రకుల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ రిలీజైంది. ‘హే మెనీనా.. ఐ సీయూ వాన్న లవ్‌’ అనే సాంగ్ ను ఆదివారం సాయంత్రం రిలీజ్ చేసింది సినిమా యూనిట్. సాంగ్ లో నాగ్‌ చాలా స్టైలిష్‌ గా,  ఓ ఇంగ్లీష్ బ్యూటీతో ప్రేమలో ఉన్నట్లుగా చూపించారు.

సమంత, కీర్తి సురేశ్‌ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి.. చైతన్‌ భరద్వాజ్‌ మ్యూజిక్.  మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘మన్మథుడు-2’ ఆగస్ట్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Latest Updates