‘మన్మథుడు 2’ టీజర్‌ : ఈ వయసులో మీకు పెళ్లేంటి సార్

manmadhudu-2-teaser-released

రాహుల్‌ రవీంద్రన్‌ డైరెక్షన్ లో అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న సినిమా మన్మథుడు 2. మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్‌9న ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత గెస్ట్ రోల్ లో కన్పించనుంది.

నాగ్ సరసన కీర్తీ సురేశ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న ‘మన్మథుడు 2’ టీజర్‌ గురువారం విడుదలైంది. ‘నీకు షట్టర్లు మూసేసి దుకాణాలు సర్దేసే వయసొచ్చేసింది’ అని నటి దేవదర్శిని.. నాగ్‌ను ఉద్దేశిస్తూ చెబుతున్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. ఈ వయసులో మీకు పెళ్లేంటి సార్..ఎండిపోయిన చెట్టుకు నీరు పోస్తే మళ్లీ పూలు పూస్తాయా అని వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తుంది. ఇంకా పెళ్లి చేసుకోలేందంటూ నాగ్‌ తల్లి(దేవదర్శిని), బామ్మ (లక్ష్మి) కామెంట్లు చేస్తూ ఉంటారు. నాగ్‌ మాత్రం పెళ్లి చేసుకోకుండా అమ్మాయిలతో రొమాన్స్‌ చేస్తూ గడిపేస్తుంటాడు. టీజర్‌ చివర్లో నాగ్‌ స్టైల్‌గా.. ‘ఐ డోన్ట్‌ ఫాల్‌ ఇన్‌ లవ్‌.. ఐ ఓన్లీ మేక్‌ లవ్’ అని చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.

ఇప్పటికే ఈ మూవీ పోస్టర్స్ ఆకట్టుకుంటుండగా..ఇవాళ వచ్చిన టీజర్ చూస్తుంటే మన్మథుడు సినిమాకి మించిన కామెడీ ఈ సినిమాలో కన్ఫమ్ అంటున్నారు ఫ్యాన్. రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రారంభం నుంచే మంచి అంచనాలున్నాయి. నాగ్ కూడా చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నాడని ఖుషీ అవుతున్నారు అక్కినేని అభిమానులు.

Latest Updates