రెండో మన్మథుడు.. వయసు మరింత తగ్గాడు!!

వావ్…

నాగార్జున లేటెస్ట్ స్టిల్స్ చూసి ఇపుడు టాలీవుడ్ అంటున్న ఒకే ఒక మాట ఇది. 

మన్మథుడు సీక్వెల్ కోసం నాగార్జున సహా.. టీమ్ అంతా పోర్చుగల్ లో ఉందిప్పుడు. మూవీకి సంబంధించిన లేటెస్ట్ స్టిల్స్ విడుదలచేసింది. ఈ స్టిల్స్ చూసి ఇండస్ట్రీ అంతా ఒక్కసారి అవాక్కయ్యింది. నాగార్జున ఈ ఏజ్ లోనూ.. ఇంత స్లిమ్ గా.. ఇంత ఫిట్ గా.. ఇంత అందంగా… ఎలా ఉన్నారబ్బా అని చర్చించుకుంటోంది. కాలంతోపాటు… అందరి ఏజ్ పెరిగిపోతుంటే.. నాగార్జున మాత్రం మరింత తగ్గినట్టుగా కనిపిస్తున్నారంటూ అతిశయోక్తిగా చెప్పుకుంటోంది.

మన్మథుడు అంటేనే సమ్మోహనం చేేసేవాడని అర్థం. ఆ టైటిల్ కు జస్టిఫికేషన్ ఇవ్వకపోతే సీన్ రివర్స్ అవ్వడం ఖాయం. అందుకే.. హీరో నాగార్జున, దర్శకుడు విజయభాస్కర్ ఆ విషయంలో బాగా సక్సెస్ అయ్యారు. ఆ మూవీ 2002 లో వచ్చింది. 17 ఏళ్ల తర్వాత ఇపుడు మన్మథుడు -2 వస్తోంది. లుక్కు, స్టైల్, ఫిట్ నెస్ పరంగా.. ఏమాత్రం తగ్గేది లేదన్నట్టుగా అటు నాగార్జున , ఇటు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఓ రేంజ్ లో కసరత్తు చేస్తున్నారు. ఆ కష్టం ఫలితమే ఈ స్టిల్స్ అని చెప్పాల్సిన పనిలేదు.

మన్మథుడు 2 సినిమా షూటింగ్ పోర్చుగల్ లో జరుగుతోంది. అందుకు సంబంధించిన స్టిల్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. మనం ఎంటర్ టైన్ మెంట్స్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్థలు ఈ మూవీని నిర్మిస్తున్నాయి. సంగీతం : చైతన్ భరద్వాజ్.

Latest Updates