గ్రూప్ ఫొటో రిలీజ్ : మన్మథుడు-2టీమ్ ఇదే..

హైదరాబాద్‌: యవసామ్రాట్ అక్కినేని నాగార్జున, అన్షు, సోనాలిబింద్రే నటించిన మన్మథుడు సూపర్ హిట్ కాగా..ఇప్పుడు మన్మథుడు -2తో రాబోతున్నాడు నాగ్. ఈ సినిమా ఇటీవల ప్రారంభం అయ్యింది. షూటింగ్ స్పీడ్ గా జరుగుతంది. మన్మథుడు-2 స్టార్ కాగానే ప్రమోషన్స్ స్పీడ్ అప్ చేస్తుంది యూనిట్. ఈ క్రమంలోనే సోమవారం ఈ మూవీలో నటించే టీమ్ అంతా కలిసి ఓ గ్రూప్ సెల్ఫీ దిగారు. ఈ పిక్ ను యూనిట్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఇదే మన్మథుడు -2 టీమ్ అని ట్వీట్ చేసింది.

ఓ ఫొటోను నాగార్జున ట్విటర్‌ లో  షేర్‌ చేశాడు. ‘నేను, నా ‘మన్మథుడు 2’ ఫ్యామిలీ.. లవింగ్‌ ఇట్‌’ అంటూ లవ్‌ సింబల్‌ ను పోస్ట్‌ చేశాడు. ఈ ఫొటోలో నాగ్‌, రకుల్‌ జంట చక్కగా కనిపించింది. నాగ్‌ కొత్త లుక్‌ లో యంగ్‌ గా కనిపిస్తున్నాడు. డైరెక్టర్ రాహుల్‌ రవీంద్రన్‌ తోపాటు రావు రమేశ్‌, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్‌, దేవదర్శిణి తదితరులు ఫొటోలో కనిపించారు. ఇదే సందర్భంగా తీసిన మరో ఫొటోను రాహుల్‌ పంచుకున్నాడు. ఇటీవల ‘మన్మథుడు 2’ షూటింగ్‌ ప్రారంభమైంది. మనం ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై నాగార్జున, జెమిని కిరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Latest Updates