మన్ననూరు మచ్చల గిత్త

కండలు తిరిగిన ఒంగోలు గిత్తలకు సమానమైన జన్యు లక్షణాలు కలిగిన మన్ననూరు మచ్చల పశువులు రాష్ట్రానికి అంతర్జా తీయంగా పేరు తీసుకొస్తున్నాయి. ఏ కాలంలోనైనా,ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా ఉత్సాహంగా పని చేస్తాయి. ఇవి ఎక్కువగా నాగర్ కర్నూల్ జిల్లాలో ని నల్లమల అటవీ ప్రాంతంలో కనిపిస్తాయి. వీటికి అంతర్జా తీయ ఖ్యాతి తీసుకొచ్చేందుకు ఇప్పటికే ‘తెలంగాణ జీవ వైవిధ్య సంస్థ’తో పాటు ‘కోనేరు’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రయత్నాలు చేస్తున్నాయి.

మచ్చల పశువుల గురిం చి ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రాంత రైతులకు తెలియడంతో వీటికి డిమాం డ్ పెరిగింది. చిన్న,సన్నకారు రైతులు వేల రూపాయలతో పశువులు కొనలేరు. ఒకవేళ కొన్నా వాటి తిండికయ్యే ఖర్చులు భరించలేరు. అలాంటి రైతులకు మచ్చల పశువులతో ఇబ్బందులు ఉండవు. ‘అటవీ ప్రాంతంతోపాటు కొం డలు, గుట్టల్లో ని మెట్ట పొలాల్లో సాగుపనుల కోసం వీటిని ఉపయోగిస్తున్నాం. ఈ ప్రాంతాల్లో ఇతర జాతి పశువులు వ్యవసాయపనులు చేయలేవు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ తురుపు జాతి పశువులకు అంతర్జా తీయంగా గుర్తింపు వస్తే వీటిపై ఇంకొన్ని పరిశోధనలు చేసే అవకాశం కలుగుతుంది. ఇవి పచ్చిగడితో పాటు ఎండుగడ్డి కూడా మేస్తాయి. వీటిని స్థానికంగా పొడ జాతి పశువులు అని కూడా పిలుస్తుంటా’మని ఇక్కడి రైతులు చెబుతున్నారు.

అరుదైన జాతి పశువులకు గుర్తింపునిచ్చే ‘నేషనల్ బోర్డ్ ఫర్ యానిమల్స్ జెనెటిక్ రిసోర్సెస్’ ‘తెలంగాణ జీవ వైవిధ్య సంస్థ’.. పొడజాతి పశువులను వారసత్వ సంపదగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల ప్రతిపాదనలు పంపాయి. ‘వాటర్ షెడ్ సపోర్ట్ సర్వీసెస్ అండ్ నెట్ వర్క్’ సంస్థ కూడా ఈ విషయంలో కృషి చేస్తోంది. ఇప్పటికే ఈ జాతికి చెందిన 100 కోడె గిత్తలు, 200 ఆవులు, 400 దూడలపై అధ్యయనం చేసిం ది. 2016లో అమ్రాబాద్ మండలంలోని బీ లక్ష్మాపూర్ గ్రామంలో మొదటిసారి పొడజాత పశువుల ప్రదర్శన నిర్వహించారు. ‘ప్రభుత్వ కృషి ఫలిస్తే తెలంగాణలోఅంతర్జా తీయ గుర్తింపు పొం దిన పశు జాతిగా ‘పొడజాతి’కి గుర్తింపు దక్కుతుంద’ని రైతులు చెబుతున్నారు.

‘మచ్చల పశువుల బలానికి కారణం వీటికున్న ప్రత్యేకమైన జన్యు లక్షణం. అందువల్లే పొడివాతావరణంలోనూ అవలీలగా ఇవి బతుకుతున్నాయి. జీవ వైవిధ్య సంస్థ చేసిన అధ్యయనంలో కూడా ఈ విషయాలు తెలిశాయి. ఈ జాతి పశువులు వర్షం రాకను ముందుగానే పసిగట్టి తమ గమ్యస్థానా లకు చేరుకుం టాయి. అమ్రాబాద్ మండలం, పదర, వంకేశ్వరం తదితర ప్రాంతాల్లో ఈ జాతి సంపద సుమారు 11,500 ఉన్నట్టు ప్రభుత్వం అంచనా వేసిం ద’ని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి అంజిలప్ప తెలిపారు.

Latest Updates