ఢిల్లీ పెద్దల సమక్షంలో విజయశాంతి బీజేపీలో చేరుతారు

అనేక మంది కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి రావటానికి సిద్ధంగా ఉన్నారన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఈ క్రమంలోనే ఢిల్లీ పెద్దల సమక్షంలో విజయశాంతి బీజేపీలో చేరుతారన్నారు. తన పదవి కాపాడుకోవటానికే ఉత్తమ్ తన చెంచాలతో నాపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని..కేసీఆర్, కేటీఆర్ లు ఇంటర్నేషనల్ దొంగలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధిని కేసీఆర్ చూసి రావాలన్న ఆమె.. కొడుకును ముఖ్యమంత్రిని చేయాలన్న కేసీఆర్ కలలు నెరవేరవన్నారు. కొత్త సీసాలో పాత సారాయి తరహా.. టీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఉందన్నారు.

మన అనే పదమే కేసీఆర్ కు సూటు కాదన్న అరుణ..నా నగరం.. నా పార్టీ.. నా పాలన అంటే బాగుండేదన్నారు. బీజేపీ బలం చూసి మంత్రి కేటీఆర్ పరేషాన్ లో ఉన్నాడని.. ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని కేసీఆర్ ముస్లింలను మోసం చేస్తున్నాడన్నారు. పాతబస్తీ అధ్వానంగా మారటానికి ఎంఐఎం పార్టీనే కారణమన్న ఆమె..డబుల్ బెడ్రూం ఇళ్ళు కావాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ఎంఎల్ఏలు, కార్పోరేటర్లు కూడా కేసీఆర్ మాదిరి ప్రజలను కలవరన్నారు. హిందువులపై అనుచిత వ్యాఖ్యలు,  బైంసా ఘటనపై కేసీఆర్ ఎందుకు మాట్లాడరన్నారు.  టీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య చీకటి ఒప్పందం ప్రజలకు అర్థమైందని..దుబ్బాక ఫలితమే గ్రేటర్ లో రిపీట్ కాబోతోందన్నారు డీకే అరుణ.

Latest Updates