లవంగంతో ఉపయోగాలు ఎన్నెన్నో..

లవంగం చూడ్డానికి చిన్నగనే ఉంటది. కానీ, నోట్లో వేసుకుంటే తెలుస్తది దాని ఘాటు పవర్ ఏంటో!

ఎక్కడో దక్షిణ అమెరికాలో పుట్టి..  ప్రపంచవ్యాప్తంగా అందరి కిచెన్ లో చోటు సంపాదించుకుంది. కారణం లవంగంలో దాగున్న మెడిసినల్ వ్యాల్యూసే! లవంగం చెట్టు మీద ఎండిపోయి రాలిన పూలే మన దగ్గరికి లవంగాలుగా వస్తాయి. లవంగంలో ఉండే పోషకాలు శరీరంలోని అన్నిరకాల వ్యవస్థకు మేలు చేస్తాయి. లవంగం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి.

ముఖ్యంగా ఇందులోఉండే మాంగనీస్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. బలమైన ఎముకల నిర్మాణానికి సాయం చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్–-సి ఇమ్యూనిటీ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని యాక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంచుతుంది. ఇక లవంగాల్లో మాత్రమే ఉండే ఎజినాల్ అనే కెమికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శరీరంలో ప్రి-రాడికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అడ్డుకుంటుంది.

లవంగాలు యాంటిబయాటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పని చేస్తాయి. తిమ్మిర్లు, వీక్ నెస్, వాంతులు, విరేచనాలకు కారణమయ్యే బ్యాక్టీరియా శరీరంలో పెరగకుండా చూస్తుంది. టీ ట్రీ ఆయిల్తో లవంగాన్ని మరిగించి తాగితే మంచిది.

లవంగాల్లో ఉండే ‘నైలిసిసిన్’ అనే కెమికల్ షుగర్ ను కంట్రోల్ చేస్తుందని వాషింగ్టన్ యూనివర్సిటీ  స్టడీలో తేలింది.ఇన్సులిన్ ఉత్పత్తి పెంచేలా చేసి షుగర్ లెవెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కంట్రోల్లో ఉంచుతుందని పరిశోధకులు తేల్చారు.

కీళ్ల నొప్పులకు ఆయుర్వేద డాక్టర్లు లవంగం నూనెను వాడమని చెప్తారు. అందుకు కారణం లవంగాల్లో ఉండే యాంటిఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లమెటరీ గుణాలే. ఇది వాపుల్ని కూడా తగ్గిస్తుంది. డెంటల్ ప్రాబ్లమ్స్ ను పరిష్కరించడంలోనూ లవంగం బాగా పనిచేస్తుదని కూడా చెప్పారు. అందుకే టూత్ పేస్టులో లవంగం నూనె వాడుతుంటారు. పిప్పిపన్నుతో బాధపడేవాళ్లు నోట్లో రెండు చుక్కల లవంగం నూనె వేసుకొని పుక్కిలిస్తే మంచి రిలీఫ్ ఉంటుంది.

లవంగాలను నానబెట్టి, పేస్టులా చేసి గాయాలకు రాస్తే యాంటిసెప్టిక్ క్రీమ్ గా పనిచేస్తుంది. దీంట్లో ఉండే యాంటి ఫంగల్, యాంటి గ్రిమిసిడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాయం దగ్గర ఉన్న బ్యాక్టీరియాను చంపి ఇన్ఫెక్షన్ కాకుండా అడ్డుకుంటుంది.

తరచూ దాహం వేస్తుంటే నోట్లో ఓ లవంగం వేసుకుంటే సరి.. దాహం తగ్గుతుంది. బియ్యంలో లవంగాలు వేసి నిల్వ చేస్తే ఎన్నిరోజులైనా బియ్యం పురుగు పట్టదు. పాలల్లో చిటికెడు లవంగం పొడి వేసుకొని తాగితే తలనొప్పి నుంచి రిలీఫ్ ఉంటుంది.

 

Latest Updates