చంద్రబాబు హయాంలో పలు ఆలయాల కూల్చివేత : జీవీఎల్

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే  ఆంధ్రప్రదేశ్ లో అనేక దేవాలయాలను కూల్చేశారన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్. హిందూ ఉద్దారకుడిగా ప్రతి పక్షనేత చంద్రబాబు నాయుడు  ఇప్పుడు మాట్లాడుతున్నారనీ…  పుష్కరాల సమయంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. అంతర్వేది, అమరావతిలపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరారు. గతంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు జరగాల్సిందేని ఆయన డిమాండ్‌ చేశారు. దేవాలయాలపై జరుగుతున్న దాడుల నిరోధానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశామని తెలిపారు. చర్చి పై రాళ్ళు వేశారనే ఆరోపణలతో అరెస్టు చేసిన 41 మందిని తక్షణమే విడుదల చేయాలని జీవీఎల్ డిమాండ్‌ చేశారు.

Latest Updates