
మావోయిస్టు పార్టీలో మార్పులు జరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని ముందుండి నడిపించడం సవాల్ గా మారింది. దీంతో కీలక నిర్ణయం తీసుకుంది సీపీఐ మావోయిస్టు పార్టీ. కేంద్ర కమిటీలో తెలంగాణకు ప్రాతినిథ్యం కల్పిస్తూ కొత్త లిస్టును విడుదల చేసింది. చాలాకాలంగా పార్టీలో కీలక నేతగా ఉన్న కేంద్ర కమిటీ కార్యదర్శి గణపతి తప్పుకోవడంతో… నంబాల కేశవరావు నేతృత్వంలో తాజాగా 21 మంది సభ్యులతో కేంద్ర కమిటీ కొత్త జాబితా విడుదల చేసింది సీపీఐ మావోయిస్ట్ పార్టీ. ఈ కేంద్ర కమిటీలో తెలంగాణకు చెందిన 10 మంది మావోయిస్టు క్యాడర్ కు చోటు కల్పించారు. పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఏపీ నుంచి ఇద్దరికి, ఝార్ఖండ్ నుంచి నలుగురు, బీహార్ నుంచి ఒక్కరిని కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు.
వరుస ఎన్ కౌంటర్లలో అనేక మంది మావోయిస్టులు చనిపోయారు. మరికొంతమంది స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ మావోయిస్టు పార్టీని బలోపేతం చేయడం కోసం కేంద్ర కమిటీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. కేంద్ర కమిటీ సభ్యులలో తెలంగాణకు చెందిన 10 మందికి చోటు కల్పించడం చర్చనీయాంశంగా మారింది.
మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ వివేక్ , కదరం సుదర్శన్ అలియాస్ ఆనంద్, మల్లా రాజిరెడ్డి అలియాస్ గోపన్న, విప్పర్తి తిరుపతి అలియాస్ చేతన్ , అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, గజార్ల రవి అలియాస్ గణేష్, పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న, మోడం బాలకృష్ణ అలియాస్ మారోజ్, హనుమంతు అలియాస్ గణేష్ లతో కూడిన 21 మంది సభ్యులను కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు.
మరిన్ని వార్తలు…
ముస్లిం మహిళలు మసీదులో ప్రార్థనలు చేయవచ్చు
CAA వ్యతిరేక నిరసన కారులపై కాల్పులు.. ఇద్దరు మృతి
లంచం ఇవ్వలేదని చెప్పుతో కొట్టిన మహిళా ఆఫీసర్
నీళ్లకు ఎక్స్‌పైరీ డేట్ ఉందా?
పెట్రోల్ ధర పెంచిన జగన్ ప్రభుత్వం