మహిళా మావోయిస్టులపై అత్యాచారాలు పెరిగాయి: సట్వాజీ

  • సిద్ధాంతాలకు అనుగుణంగా కమిటీ నడవడం లేదు
  • ఆ తీరు నచ్చకే బయటకు వచ్చేశా
  • మీడియాతో సట్వాజీ అలియాస్ సుధాకర్
  • భార్య అరుణతో కలిసి పోలీసులకు లొంగుబాటు

హైదరాబాద్, వెలుగు: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సట్వాజీ అలియాస్‌ శరత్ అలియాస్ సుధాకర్‌‌ అలియాస్ కిరణ్ అలియాస్ శశికాంత్ లొంగిపోయినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు. సుధాకర్ తో పాటు ఆయన భార్య వైదుగుల అరుణ అలియాస్‌ నీలిమ అలియాస్ మాధవి కూడా లొంగిపోయారని తెలిపారు. ఈ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి న రూ. 35లక్షల రివార్డును  అందజేస్తామని చెప్పారు . జార్ఖండ్​లో సుధాకర్ పై రూ.1.25 కోట్ల రివార్డు ఉంది. రోజురోజుకు ప్రజలకు ఎందుకు దూరమవుతున్నామని మావోయిస్టు సెంట్రల్​ కమిటీలో తాను ప్రస్తావిం చానని, సిద్ధాంతాలకు అనుగుణంగా ఎందుకు పనిచేయటం లేదని ప్రశ్నించానని సుధాకర్ మీడియాకు తెలిపారు.
బీహార్, జార్ఖండ్​లో మహిళ మావోయిస్టులపై అత్యాచారాలు జరుగుతున్నాయని, అవి నచ్చకపోవటంతోనే బయటకు వచ్చామని వివరిం చారు. 2013లో తీర్మానా లు చేస్తే ఇంతవరకు అమలు కాలేదని, ఈ విషయాలన్నింటినీ ప్రస్తావిం చానని తెలిపారు. కుటుం బ అవసరాల కోసం పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయటం ఎక్కువైం దని ఆయన ఆరోపించారు. వీటికి సమాధానం చెప్పే స్థితిలో కేంద్ర కమిటీ కూడా లేదన్నారు. అరుణ మాట్లాడుతూ తాను ఎక్కువగా దండకారణ్యం లోనే పనిచేశానని, అక్కడ అంతగా అత్యాచార సంఘటనలు లేవని, కాకపోతే ఇక్కడ ఉన్న పితృస్వామ్య భావజాలమే అక్కడ కూడా కొంత ఉందన్నారు . పార్టీలో పనివిధానం, పార్టీ లైన్ ఆధారంగా నడవటం లేదని, ఆరోగ్యం సరిగా
లేనందున లొంగిపోయామని ఆమె వివరిం చారు.
ఆర్ఎస్ యూలో మొదలు..
నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల కేంద్రానికి చెం దిన సుధాకర్ నిర్మల్ లో ఇంటర్ చదివే రోజుల్లో రాడికల్ స్టూడెంట్స్‌‌ యూనియన్(ఆర్ఎస్ యూ)లో చేరారు. అప్పటి ఆర్ఎస్ యూ జిల్లా కార్యదర్శి వేణు, పీపుల్స్ వార్ జిల్లా కార్యదర్శి కటకం సుదర్శన్ ప్రోత్సాహంతో ఫుల్ టైమర్ గా మారారు. 1990లో పార్టీలో దళ సభ్యుడిగా చేరిన ఆయన 1992లో చెన్నూరు దళ కమాం డర్ గా, 1994 నుంచి పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 1997–99 మధ్య ఆదిలాబాద్‌ జిల్లా కార్యదర్శిగా, 1999–-2001 వరకు ఉత్తర తెలంగాణ స్పె షల్ జోనల్ కమిటీ(ఎన్టీజెడ్ సీ) సభ్యుడిగా, 2001–-03 వరకు దండకారణ్య స్పె షల్ జోనల్ కమిటీ(డీకేఎస్ జెడ్ సీ) సభ్యుడిగా, 2003 నుంచి 2013 వరకు మిలిటరీ కమిషన్‌ లో సభ్యుడిగా కొనసాగారు. 2013లో సీపీఐ(మావోయిస్టు) సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు . సెంట్రల్ కమిటీలో ఉంటూ 2014 నుంచి 2019 వరకు ఈస్టర్న్‌‌ రీజినల్ బ్యూరో(ఈఆర్‌‌బీ) సభ్యుడిగా జార్ఖండ్‌ , బీహార్‌‌ ప్రాంతానికి ఇన్‌ చార్జిగా పని చేశారు. అయితే ఈఆర్ బీలో లంపెన్ శక్తులు ఉన్నాయని, ఈ కమిటీ కులం ప్రాతిపదికన నడుస్తుం దనే భావనతో సుధాకర్ ఏడాది కాలంగా లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఈ క్రమంలో తెలంగాణ పోలీసుల ఎదుట బుధవారం లొంగిపోయాడని డీజీపీ వివరించారు. సుధాకర్‌‌ భార్య అరుణ మావోయిస్టు స్టేట్‌ కమిటీ
మెంబర్‌‌గా చేస్తూ సరెండర్‌‌ అయ్యారని తెలిపారు. వరంగల్‌ రూరల్ దుగ్గ ొండి మండలం మహ్మదాపూర్‌‌ కు చెం దిన ఈమె 8వ తరగతి చదివే సమయంలో విప్లవ పాటలకు ఆకర్షితు రాలై దళంలో చేరారు. ఆమెకు 3వ తరగతిలోనే పెళ్లయినప్పటికీ.. దళంలో చేరాక 1998లో సుధాకర్‌‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సుధాకర్‌‌తోపాటు అరుణ ఈఆర్‌‌బీలో పని చేశారు.

మహిళా మావోయిస్టుల ఆత్మహత్యలు: డీజీపీ
మావోయిస్టు పార్టీలో మహిళా మావోయిస్టులపై కొం త కాలంగా ఒత్తిళ్లు, వేధిం పులు పెరిగాయని, దీం తో వారిలో కొం దరు ఆత్మహత్యలకు
పాల్పడినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ భార్య రామక్క అలియాస్ శారద 2010లో ఆత్మహత్య చేసుకున్నారని, సౌత్ బస్తర్ డీసీఎం చందన, దళ కమాం డర్ మున్ని, దళ సభ్యురాలు సుక్కి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు గడ్డం భాగ్యలక్ష్మి అలియాస్ మహిత(కోదాడ వాసి) వంటివారు రకరకాల కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. ఇవేవీ బయటికి రాలేదని, ఇవి కూడా సుధాకర్ దంపతుల లొంగుబాటుకు ఓ కారణమని ఆయన తెలిపారు.

Latest Updates