ములుగులో మావోయిస్టు బ్యానర్లు:TRS సభకు బందోబస్తు

ములుగు జిల్లా : ములుగు జిల్లాలో మావోయిస్టుల మందుపాతర్లు, బ్యానర్లు కలకలం రేపాయి. వెంకటాపురం మండలం రామచంద్రపురం ఇసుక క్వారీ సమీపంలో రోడ్డుపై మావోయిస్టు పోస్టర్లు, బ్యానర్లు కనిపించాయి. పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరించాలని ఈ బ్యానర్లతో పిలుపు ఇచ్చారు మావోయిస్టులు.

రోడ్డుపై బ్యానర్లను పరిచారు మావోయిస్టులు. ఐతే.. ఆ బ్యానర్ల కింద మందు పాతర్లు అమర్చినట్లు పోలీసులు అనుమానించారు. జాగ్రత్తలు తీసుకున్నారు.

మరోవైపు… ఈనెల 27న అంటే రేపు.. వెంకటాపురం మండలంలో టీఆర్ఎస్ బహిరంగ సభ ఉంది. మావోయిస్టు బ్యానర్లతో అలర్టైన భధ్రతాబలగాలు… నాయకులకు భద్రత పెంచారు. సభకు స్ట్రాంగ్ సెక్యూరిటీ ఇస్తున్నారు.

Latest Updates