తూర్పు గోదావరి జిల్లాలో మావోయిస్టుల విధ్వంసం

తూర్పు గోదావరి జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. చింతూరు మండలంలోని సరివెల గ్రామ సమీపంలోని వెంకట్రామపురం దగ్గర విధ్వంసానికి పాల్పడ్డారు. చంద్రవంక వాగు పై రహదారి, బ్రిడ్జి నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న 2 ట్రాక్టర్లు, 2 జేసీబీ ప్రొక్లైన్లు, 1 ఐషర్, ఒక లారీ తో పాటు మిల్లర్లులను మావోయిస్టులు తగలబెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మావోయిస్టుల కోసం చుట్టు పక్క గ్రామాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Latest Updates