16 మందిని కిడ్నాప్ చేసి చంపిన మావోయిస్టులు

దేశంలో మావోయిస్టుల క‌ద‌లిక‌లు పెర‌గ‌డంతో వారి కోసం పోలీసులు, ప్ర‌త్యేక ద‌ళాలు అడ‌వుల‌ను జ‌ల్లెడ ప‌డుతున్నాయి. అయినా కూడా మావోయిస్టులు మాత్రం తమ కార్యకలాపాలను పెంచుతూనే ఉన్నారు. తాజాగా మావోయిస్టులు ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్ జిల్లా గంగ‌లూర్ ప‌రిధిలో దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. కుర్చేలి గ్రామానికి చెందిన 16 మందిని మావోయిస్టులు హ‌త‌మార్చారు. మావోల చర్యకు బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గుర‌వుతున్నాయి. మావోయిస్టులు సెప్టెంబ‌ర్ 5వ మోటపాల్ గ్రామానికి చెందిన 25 మందిని అప‌హ‌రించారు. అనంత‌రం ప్ర‌జాకోర్టు నిర్వ‌హించి న‌లుగురు వ్య‌క్తుల గొంతు కోసి చంపారు. కొన్ని రోజుల త‌ర్వాత ఐదుగురిని విడుద‌ల చేశారు. కాగా.. మిగ‌తా 16 మందిని మాత్రం త‌మ ఆధీనంలోనే ఉంచుకున్నారు. వారిని గురువారం హ‌తమార్చారు. ఇలా ఒకే నెలలో మొత్తం 20మందిని మావోయిస్టులు హ‌త్యచేయ‌డం క‌ల‌క‌లం సృష్టిస్తోంది.

For More News..

పీజీలు చదివి బిచ్చమెత్తుతున్నారు

రాష్ట్రంలో కొత్తగా 2,214 కరోనా కేసులు

వడ్ల కొనుగోలు కేంద్రంలో గోల్​మాల్​.. రూ. 14 లక్షలు కొట్టేసిన మహిళ ఆపరేటర్

Latest Updates