మరాఠా రిజర్వేషన్లు : మహారాష్ట్ర  ప్రభుత్వానికి ఊరట

మరాఠా  రిజర్వేషన్లపై  మహారాష్ట్ర  ప్రభుత్వానికి  భారీ ఊరట లభించింది.  మరాఠాల  రిజర్వేషన్లపై   స్టే ఇవ్వాలని  సుప్రీంలో దాఖలైన  పిటిషన్ పై  అత్యున్నత  న్యాయస్థానం  విచారణ జరిపింది.  అయితే  ఈ రిజర్వేషన్లపై  స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.  అయితే  గత పరిణామాలను  దృష్టిలో పెట్టుకోవాలని  సూచించింది. విద్యా,  ఉద్యోగాల్లో  మరాఠాలకు ప్రత్యేకంగా  రిజర్వేషన్ కల్పిస్తూ  మహారాష్ట్ర  అసెంబ్లీ  గతంలో తీర్మానం  చేశారు. ఆ ప్రకారం  12 శాతం  రిజర్వేషన్లు కల్పించారు.   దీంతో మహారాష్ట్రలో  మొత్తం  రిజర్వేషన్లు  65 శాతానికి  చేరాయి.

తమిళనాడులో  69 శాతం  రిజర్వేషన్లు అమలవుతున్నాయి.  సుప్రీం కోర్టు  తీర్పు ప్రకారం  రిజర్వేషన్లు 50 శాతం  దాటకూడదు. అయితే  ప్రత్యేక పరిస్థితుల్లోనే  రిజర్వేషన్లు  ప్రకటించామని  మహా ప్రభుత్వం  చెప్పడంతో ఇటీవలే  బొంబాయి హైకోర్టు  ఆ నిర్ణయాన్ని  సమర్థించింది. ఇప్పుడు సుప్రీం  కూడా  స్టేకు నిరాకరిస్తూనే ….మహారాష్ట్ర ప్రభుత్వానికి  నోటీసులు  జారీ చేసింది.

Latest Updates