రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్ మ‌ృతి…

మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ మరాఠా సింగర్ గీతా మాలి మృతి చెందారు. నిన్ననే అమెరికా నుంచి వచ్చిన గీతా దంపతులు తమ స్వస్థలమైన నాసిక్‌కు కారులో బయలుదేరారు. వారు ముంబై- ఆగ్రా రహదారిలో ప్రయాణిస్తుండగా వారి కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గీతా మాలి మరియు ఆమె భర్త విజయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని షాపూర్ రూరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సింగర్ గీతా మాలి మృతి చెందారు. అమెరికా నుంచి వచ్చిన గీతా.. ఛత్రపతి శివాజీ టెర్మినల్‌లో ల్యాండైన తర్వాత తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను చివరిసారిగా తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్ చేశారు.

మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి

Latest Updates