నేలపైన లోతైన చోటు ఇది

భూమ్మీద లోతైన చోటు ఏది అంటే.. వచ్చే సమాధానం పసిఫిక్​ మహా సంద్రంలోని మెరియానా ట్రెంచ్​. అది సముద్రాల విషయం. మరి, నేల మీద అత్యంత లోతైన ప్రాంతం ఏంటి? దానికి యూనివర్సిటీ ఆఫ్​ కాలిఫోర్నియా సైంటిస్టులు సమాధానం చెబుతున్నారు. ఏంటో తెలుసా.. తూర్పు అంటార్కిటికాలోని డెన్మన్​ గ్లేసియర్​. గ్లోబల్​ వార్మింగ్​ కారణంగా అంటార్కిటికాలోని గ్లేసియర్లు బాగా కరిగిపోతున్నాయట. అట్ల కరిగిపోవడం వల్ల డెన్మన్​ గ్లేసియర్​ బాగా లోతైందట. సముద్ర మట్టానికి దాదాపు 3.2 కిలోమీటర్ల లోతు ఉంటుందని గ్లేసియాలజిస్టులు చెబుతున్నారు. ఆ ఏరియాలో దాదాపు కొన్ని నెలల పాటు చేసిన పరిశోధన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చామంటున్నారు. వేరే చోట్లతో పోలిస్తే తాము ఊహించినదాని కన్నా ఎక్కువ లోతు ఉందని తేల్చారు. దాదాపు 100 కిలోమీటర్ల పొడవు, 20 కిలోమీటర్ల వెడల్పున్న గ్లేసియర్​ ప్రాంతంలో అంత లోతుందని చెబుతున్నారు. బెడ్​మెషీన్​ టెక్నాలజీని ఉపయోగించి ఈ లోతైన ప్రాంతాన్ని నిర్ధారించామంటున్నారు. ఐస్​ కింద బెడ్​ టోపోగ్రఫీ మిస్సైందని, కొండలు, లోయల వంటి ఫీచర్లేవీ ఆ ప్రాంతంలో లేవని తేల్చారు. అక్కడి ఐస్​ కరిగిపోయి సముద్రం వైపు వెళ్లడానికి సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే ఐస్​ కింద చాలా వరకు కరిగిపోయి ఉందని, పై పొర కూడా కరిగిపోతే సముద్ర మట్టాలు పెరిగే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు.

Latest Updates