మార్కెట్ లీడర్ సంతూర్

  • లక్స్ ను వెనక్కి నెట్టింది

‘లైఫ్‌‌‌‌బాయ్ ఎక్కడుందో ఆరోగ్యం అక్కడ ఉందీ’ ఈ యాడ్ గుర్తుండే ఉంటుంది కదా. నాలుగు దశాబ్దాలకు పైగా ఈ యాడ్‌‌‌‌తోనే కస్టమరను తనవైపుకి తిప్పుకుంది లైఫ్‌‌‌‌బాయ్. కానీ ఈ లైఫ్‌‌‌‌బాయ్ సోపు ప్రస్తుతం రారాజు కిరీటం కోల్పోతోంది. దేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే సోపు బ్రాండ్‌‌‌‌గా పేరు తెచ్చు కున్న లైఫ్‌‌‌‌బాయ్, 2016 నుంచి కంటిన్యూగా మార్కెట్ వాటా కోల్పోతుందని కంతార్ వరల్డ్‌ ‌‌‌ప్యానల్ డేటాలో తెలిసింది. వినియోగదారులు ఎక్కువగా సహజసిద్ధమైన ఉత్పత్తులకే మొగ్గుచూపుతుండటంతో, లైఫ్‌‌‌‌బాయ్‌‌‌‌కి ఈ పరిస్థితి ఎదురవుతోంది. లైఫ్‌‌‌‌బాయ్ కిరీటం పడిపోతుంటే, విప్రో కన్జ్యూమర్ కేర్‌కు చెందిన సంతూర్‌ రయ్ మంటూ దూసుకొస్తోంది. సంతూర్ సహజ సిద్ధమైన ప్రొడక్ట్ గా మార్కెట్‌ చేసుకుంటూ.. వినియోగదారులను సొంతం చేసుకుంటోంది. HUL కు చెందిన లక్స్ బ్రాండ్‌‌‌‌ను ఎప్పుడో రెండో స్థానం నుంచి కిందకి పడేసి, ఆ స్థానంలో సంతూర్  చేరింది.

వినియోగదారులు రసాయన పదార్థాలతో తయారయ్యే వాటిపై ఆందోళన చెందుతూ… సహజ సిద్ధమైన ఉత్పత్తుల వైపుకి మరలుతున్నారని బ్రాండ్ స్ట్రాటజిస్ట్ డీవై వర్క్స్ మేనేజింగ్ డైరెక్టర్ అల్పన పరిద తెలిపారు. మా రుతున్న వినియోగదారుల ఎంపికలకు అనుగుణంగా మల్టినేషనల్ కంపెనీలు పనిచేయట్లేదని, సహజ సిద్ధమైన, ఆయుర్వేద బ్రాండ్లలో వారు ఆఫర్లను విస్తరించడంలేదని చెప్పారు. సంతూర్‌ సోపు గంధపు నూనె, ఓలియో రెసిన్ పసుపు కలయికలతో రూపొందింది. లక్స్‌‌‌‌, లైఫ్‌ ‌బాయ్‌ ‌‌‌లలో ఉన్న ఇతర రసాయన పదార్థాలు సంతూర్‌లో ఉన్నప్పటికీ, దీనిలో ఉన్న పసుపు, గంధపు నూనెలపైన వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. మార్కెట్‌ లీడర్‌గా సంతూర్‌ ఎదుగుతున్నప్పటికీ, వృద్ధి మాత్రం నెమ్మదిగానే ఉంటుందని మార్కెట్ వర్గాలన్నాయి.

యూరోమానిటర్ ఇంటర్నేషనల్ అంచనా ప్రకారం ఇండియా సోపు మార్కెట్ 2022 నాటికి కేవలం 2.3 శాతం మాత్రమే పెరిగి రూ.21,130 కోట్లకు చేరుకోనుంది. 2012-17 మధ్య కాలంలో ఈ వృద్ధి 9.8 శాతంగా ఉంది. కంతార్ వరల్డ్‌‌ ‌‌ప్యానల్ డేటా ప్రకారం 2016 జూన్‌ నుంచి లైఫ్‌ ‌‌‌బాయ్ మార్కెట్ షేరు 340 బేసిస్ పాయింట్లు, లక్స్ షేరు 150 బేసిస్ పాయింట్లు తగ్గింది.. సంతూర్ షేరు 140 బేసిస్ పాయింట్లు, గోద్రెజ్ నెంబర్.1 షేరు110 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఇదే కాలంలో పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ షేరు కూడా 3.7 శాతం జంప్ చేసింది. విప్రో కన్జ్యూమర్ కేర్‌కు వచ్చిన రూ.6,682.6 కోట్ల రెవెన్యూల్లో 42 శాతం సోపుల నుంచే వస్తున్నాయి. HUL సేల్స్‌‌‌‌లో 30 శాతం సోపులదే.

Latest Updates