ఆర్బీఐ  ప్రకటనతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు

కరోనా వైరస్ కారణంగా డీలా పడ్డ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఇవాళ(సోమవారం) కీలక ప్రకటన చేసింది. మ్యూచువల్ ఫండ్ల రంగంలో ద్రవ్య లభ్యతను పెంచేందుకు రూ. 50 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ స్టాకులు మార్కెట్లను ముందుండి నడిపించాయి. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 415 పాయింట్లు లాభపడి 31,743కి పెరిగింది. నిఫ్టీ 128 పాయింట్లతో 9,300 కి చేరుకుంది. పవర్ మినహా అన్ని సూచీలు లాభాల్లో ముగిశాయి.

Latest Updates