దూసుకెళ్లిన మార్కెట్.. బెస్ట్ క్వార్ట‌ర్లీ రికార్డ్

  • 20 శాతం పెరిగిన స్టాక్ మార్కెట్లు
  • రికవరీపై ఆశలతో ర్యాలీ
  • ఫారిన్ క్యాపిటల్ ఫుల్‌‌గా వచ్చింది

ముంబై : ఇండియన్ స్టాక్ మార్కె ట్లు ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో 20 శాతం వరకు పెరిగాయి. 2009 సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌ తర్వాత బెస్ట్ క్వార్టర్లీ గెయిన్స్ రికార్డు కావడం ఇదే మొదటి సారి. కరోనా వైరస్‌‌తో గత మూడు నెలల నుంచి ఎకనమిక్ యాక్టివిటీ బా గా దెబ్బతింటోంది. ఈ సమయంలో కూడా ఇండియన్ స్టాక్ మార్కె ట్లు ర్యాలీ చేశాయి. లాక్‌‌డౌన్‌ తర్వాత ఎకనమిక్ రికవరీ బాగుంటుందనే ఆశలతో ఈ ర్యాలీ జరిగింది. ఇండియన్ మార్కె ట్లలోకి లిక్విడిటీ రాక కూడా పెరిగిందని, ముఖ్యం గా ఫారిన్ క్యాపిటల్ ఎక్కువగా వచ్చినట్టు అనలిస్ట్‌ లు చెప్పా రు. అయితే గత క్వార్టర్‌‌‌‌తో పోలిస్తే ఏప్రిల్–జూన్ క్వార్టర్‌‌‌‌లో సెన్సెక్స్ లా భాలు 28 శాతం, నిఫ్టీ లాభాలు 29 శాతం తగ్గినట్టు మింట్ అనాలసిస్‌‌లో తేలింది.

బీఎస్‌‌ఈ మిడ్‌‌క్యాప్, బీఎస్‌‌ఈ స్మాల్‌‌క్యాప్ సూచీలు మాత్రం జూన్ క్వార్టర్‌‌‌‌లో 24.29 శాతం, 29.68 శాతం పెరిగాయి.రంగాల వారీగా చూసుకుం టే, బిగ్గెస్ట్ గెయినర్లుగా ఉన్న బీఎస్‌‌ఈ ఆటో 42.29 శాతం, బీఎస్‌‌ఈ టెలికాం 36.08 శాతం పెరిగినట్టు వె ల్లడైంది. ఎకానమీ రికవరీపై ఆశలతో, లిక్విడిటీతో స్టాక్ మార్కెట్లు ర్యాలీ చేసినట్టు ఎంకే వె ల్త్ మేనేజ్‌ మెంట్‌‌ రీసెర్చ్ హెడ్ జోసెఫ్ థామస్ చెప్పా రు. అయితే కరోనా వైరస్ ప్రభావం ఎకానమీపై ఎంత ఉందో కరెక్ట్‌ గా తెలుసుకోవడానికి మరో మూడు నెలలు సమయం పడుతుం దని పేర్కొన్నా రు. ఎకనమిక్ గ్రోత్, డిమాం డ్, ఎంప్లాయ్‌ మెంట్ పెరిగేందుకు ప్రభుత్వం , ఆర్‌‌‌‌బీఐ తీసుకున్న చర్యల ఫలితం అప్పుడు కానీ తెలీదని చెప్పా రు. అంచనాలకు  తగ్గట్టు యాక్చువల్ లె క్కలు రాకపోతే.. అవి మార్కె ట్లను నిరాశపరుస్తాయని, దాం తో మార్కె ట్లు కరెక్షన్‌ కు గురై కిం దకు పడిపోతాయని థామస్ అంచనావేశారు. కన్జూ మర్ ద్రవ్యోల్బణం,ఇండియా–చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యలు, అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్లు మన దేశ మార్కెట్‌‌ను ఎప్పడికప్పుడు ప్రభావితం చేయ-నున్నాయని థామస్ తెలిపారు.

ఎఫ్‌ ఐఐలు 3.91 బిలియన్ డాలర్లు పెట్టారు ..

జూన్ 30తో ముగిసి న మూడు నెలల కాలంలో ఫారిన్ ఇన్‌ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌ఐఐలు) నెట్ బయ్యర్లు గా ఉండి ఇండియన్ ఈక్విటీల్లోకి 3.91 బి లియన్ డాలర్ల మనీ ఇన్వెస్ట్ చేశారు. దేశీయ ఇన్‌ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (డీఐఐలు) ఇండియన్ షేర్లలో రూ .10,941.31 కోట్లను పెట్టుబడిగా పెట్టారు. మార్చి నెలలో నమోదైన కనిష్ట స్థాయి ల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ 35.2శాతం పెరిగాయి. అయితే ఈ ఏడాది జనవరిలో రికార్డైన గరిష్ట స్థాయి ల నుంచి కనీసం 17 శాతం తక్కువ లో మార్కె ట్లు ఉన్నాయి . ఈ ఏడాది ప్రారంభమైనప్పటి నుంచి చూసుకుం టే సెన్సెక్స్, నిఫ్టీ ఇంకా 15 శాతం వరకు డౌన్‌ లోనే ఉన్నాయి . కరోనా వైరస్ వ్యాప్తితో పాటు, పెద్ద పెద్ద కార్పొరేట్ లేదా ఫైనాన్సి యల్ ఇన్‌ స్టిట్యూషన్ సంస్థలు ఫెయిల్ కావడం, సరిహద్దు సమస్యలు, కరెన్సీల్లో ఒడిదుడుకులు కూడా మార్కెట్లకు ప్రమాదకరంగా ఉండనున్నాయని డీఎస్‌‌పీ ఇన్వెస్ట్‌ మెంట్ మేనేజర్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అథుల్ భోలే చెప్పా రు.

Latest Updates