తాళి కట్టేముందు ఝలక్ : పెళ్లికి నిరాకరించిన పెళ్లికూతురు

మహబూబాబాద్​ అర్బన్, వెలుగు: కొద్ది నిమిషాల్లో పెళ్లితంతు పూర్తవుతుందనగా పెళ్లికూతురు వివాహానికి నిరాకరించిన ఘటన మహబూబాబాద్ లో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన యువతి, మహబూబాబాద్ కు చెందిన యువకుడికి వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయచారు. అబ్బాయి, అమ్మాయి అంగీకారంతో పెళ్లికి ముహూర్తం నిర్ణయచారు. మహబూబాబాద్ లోని ఓ ఫంక్షన్ హా ల్ లో గురువారం పెళ్లి జరగాల్సి ఉంది. కొద్దిసే పట్లో వివాహతంతు పూర్తవుతుందనగా పెళ్లికుమార్తె అకస్మాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకుంది.

తాను పెళ్లి పీటల మీదికి రానని, తనకు పెళ్లి ఇష్టంలేదని చెప్పడంతో అంతా ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. రెం డు కుటుంబాలవారు ఎంతగా సర్దిచెప్పినా అంగీకరించలేదు. రెండు కుటుంబాల మధ్య కొద్దిసే పు వాగ్వివాదంచోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ టౌన్ సీఐ రవికుమార్ అక్కడికి చేరుకున్నారు. ఘర్షణలు తలెత్తకుండా ఇరు కుటుంబాలతో మాట్లాడి వారికి సర్దిచెప్పారు. ఈ విషయంపై సీఐ రవికుమార్ మాట్లాడుతూ”అమ్మాయికి ఇష్టం లేదని చెప్పడంతో పెళ్లి నిలిచిపోయిందని తెలిపారు.

Latest Updates