పెళ్లి వాహనం బోల్తా.. 20 మందికి గాయాలు

ఎంతో సంతోషంతో పెళ్లికి వెళ్తున్న వారి ఆనందం ఒక్కసారిగా ఆవిరిపోయింది. పెళ్లికి వెళ్తున్న వాహనం బోల్తా పడిన ఘటన కడప జిల్లాలో జరిగింది. అనంతపురం జిల్లా, గార్లదిన్నేకు చెందిన ఒక పెళ్లి బృందం రాయచోటిలో వివాహానికి బయలుదేరారు. గాలివీడు మండలం, రామాపురం వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న డీసీఎం వ్యాను అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున జరిగినట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాసేపట్లో పెళ్లి మండపానికి చేరుకుంటారనగా ఈ ప్రమాదం జరిగింది.

For More News..

ఇకనుంచి షాపులు రాత్రుళ్లూ ఓపెన్

బీఏకు పెరుగుతున్న డిమాండ్.. ఈ ఏడాది స్టూడెంట్లు 91.98 లక్షలు

కారులో 400 రోజులు.. లక్ష కిలోమీటర్లు..

Latest Updates