వికటించిన పెళ్లి విందు.. 300 మందికి అస్వస్థత

అప్పటి వరకు సందడిగా.. సంతోషంగా ఉన్న పెళ్లిమంటపంలో ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 300 మంది అస్వస్థతకు గురయ్యారు. నిర్మల్ జిల్లా భైంసాలోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన పెళ్లిలో పాయసం తిన్న దాదాపు మూడు వందల మంది ఆస్పత్రి పాలయ్యారు. విందులో వడ్డించిన పాయసం తిన్న కొందరికి వాంతులు, విరేచనాలు కావడంతో సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తరలించి ట్రీట్ మెంట్ అందించారు. మొదటి రెండు బంతుల్లో భోజనం చేసినవారు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత భోజనం చేసిన వారు కూడా తమకు ఏమికాకున్నా భయంతో ఆస్పత్రులకు క్యూ కట్టారు. ఈ ఘటనలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు.

Latest Updates