వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

హైదరాబాద్ KPHB కాలనీలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వరకట్న వేధింపులే మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ధనలక్ష్మికి KPHBలో ఉండే విజయకృష్ణారావుతో గతేడాది ఏప్రిల్ లో పెళ్లి జరిగింది. విజయకృష్ణారావు పంజాగుట్టలోని విద్యాశాఖ కార్యాలయంలో రికార్డు అసిస్టెంటుగా ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి సమయంలోనే 10 లక్షల నగదు, ఎకరం పొలం, నలభై కాసుల బంగారం కట్నంగా ఇచ్చినట్లు చెప్తున్నారు బంధువులు. పెళ్లి జరిగిన కొద్ది రోజుల నుంచే అదనపు కట్నం తేవాలని వేధించడంతో…… మరో 30 లక్షలు ఇచ్చినట్లు చెప్పారు. పెళ్లయి ఏడాది గడవక ముందే ధనలక్ష్మి చనిపోవడంపై కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

 

Latest Updates