లవ్ మ్యారేజ్ చేసుకున్న ఏడాదిలోపే మరో యువతితో పెళ్లి

married-with-another-girl-less-than-a-year-after-love-marriage

అనంతపురం: నువ్వుంటే నాకిష్టం..నువ్వులేనిది నేను బతకలేను అన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఏడాది లోపే మరో అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.  వివరాలు : కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్‌ లెక్చరర్‌ ప్రవీణ్‌ కుమార్‌.. తాను పనిచేసే కళాశాల విద్యార్థిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

అయితే అతడికి ఇంతకు ముందే త్రివేణి అనే యువతితో వివాహం అయ్యింది. అంతేకాకుండా ఆమెను కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. తనకు వివాహం అయిన విషయాన్ని దాచిపెట్టి రెండోపెళ్లి చేసుకున్న ప్రవీణ్‌ కుమార్‌ పై మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ప్రవీన్ కు ముందే పెళ్లయిన విషయం తనకు తెలియదని  పోలీసుల విచారణలో చెప్పింది విద్యార్థిని. తమకు న్యాయం చేయాలని ఇద్దరు భార్యలు పోలీసులను వేడుకోవడం అందరినీ కలచివేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Latest Updates