జాబ్ రాలేదని వివాహిత ఆత్మహత్య

జీడిమెట్ల, వెలుగు:జాబ్ రాలేదని మనస్థాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది.  ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం..గుండ్లపోచంపల్లిలోని అపర్ణ కనోపీకి చెందిన వి.పూర్ణిమ(33)కి 2011లో తమిళనాడులోని మధురైకి చెందిన కందస్వామితో పెళ్లైంది. పూర్ణిమ,కందస్వామి దంపతులు గుండ్లపోచంపల్లిలోనే ఉంటున్నారు. కందస్వామి అక్కడే ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. ఈ దంపతులకు ఓ పాప,బాబు ఉన్నారు. ఇంటి వద్దే ఉండే పూర్ణిమ జాబ్ చేయాలనే ఇంట్రస్ట్ తో ఇంటర్వ్యూలకు వెళ్లింది. కానీ ఎందులోనూ సెలక్ట్ కాలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకి వెళ్లిన పూర్ణిమకి అక్కడ కూడా జాబ్ రాకపోవడంతో ఆమె మనస్థాపానికి గురైంది. దీంతో పూర్ణిమ మంగళవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Latest Updates