దారుణం.. వివాహిత‌కు మ‌ద్యం తాగించి అత్యాచారం, హ‌త్య‌

సంగారెడ్డి జిల్లా: తెల్లపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు తండా లో దారుణం జ‌రిగింది. హేమలత (30) అనే గిరిజ‌న మహిళను ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా తేలింది. కొల్లూరు తాండాకు చెందిన హేమలత మూడు రోజుల క్రితం ఆమె మియాపూర్ లోని తల్లిగారింటికి వచ్చింది. ఈమెకు ఇద్దరు సంతానం. దగ్గర్లోని షాపుకు వెళ‌తానని మంగ‌ళ‌వారం ఇంటినుండి వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. అదే రోజు మధ్యాహ్నం కొల్లూరు సమీపం లో ఆమె మృత దేహం లభ్యం కావడంతో రామచంద్ర పురం పోలీసులు కేస్ నమోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు.

మహిళ భర్త కొన్నేళ్ల క్రితం మరణించాడు. మియాపూర్ నుంచి మహిళను నిందితులు కొల్లూరు తండాకు తీసుకుని వెళ్లినట్లు తెలిసింది. పోలీసుల‌ విచార‌ణ‌లో మధు, నందు యాదవ్, కుటుంబ‌ రెడ్డి అనే వ్య‌క్తులు మద్యం సేవించి ఆమెను అత్యాచారం చేసి హత్య చేశారని తేలింది. ఆమెపై ఈ దారుణానికి పాల్ప‌డ్డ వ్య‌క్తుల‌పై క‌ఠిన‌ చర్యలు తీసుకొని , శిక్షించాలని లంబాడి ఐక్య వేదిక ఆధ్వర్యంలో రామచంద్రపురం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు

.

Latest Updates