రెండు గుడ్లకు జస్ట్ 1700 రూపాయలే!

న్యూఢిల్లీ: చండీగఢ్‌లోని మారియట్‌ హోటల్‌లో యాక్టర్​ రాహుల్‌ బోస్‌ ఆర్డర్​ ఇచ్చిన రెండు అరటిపళ్లకు జీఎస్టీతో కలసి 442 రూపాయలు వసూలు చేయడం ఎంత వైరలైందో గుర్తుందికదా. ఇప్పుడు ముంబైలోని ఫోర్‌ సీజన్స్‌ హోటల్‌ కూడా ఇలాగే చేసింది. ఒక కస్టమర్‌ ఆర్డర్‌ చేసిన రెండు గుడ్లకు జీఎస్టీతో కలుపుకొని రూ.1,700  వసూలు చేసింది. ఒక ఆమ్లెట్‌కు కూడా ఇంతే వసూలు చేశారు. దీంతో ఆయన బిల్లును ఫొటో తీసి ట్విటర్‌లో పెట్టగా వైరల్‌ అయింది. ‘‘ఆ కోడి రెండు గుడ్లతోపాటు బంగారమూ పెట్టిందా ? ఆ కోడి చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిందా?’ అంటూ జోక్స్​ వేశారు. దీని మీద ఫోర్‌ సీజన్స్‌ హోటల్‌ నోరెత్తలేదు. రాహుల్‌ బోస్‌ నుంచి జీఎస్టీ వసూలు చేసిన మారియట్‌ హోటల్‌కు రూ.25 వేల ఫైన్​ వేశారు కదా మరి ఫోర్​సీజన్స్​ను ఏం చేస్తరో!

Latest Updates