చనిపోయిన రతన్ లాల్ కుటుంబానికి రూ.కోటి ఆర్ధికసాయం

ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థి సాయాన్ని ప్రకటించింది. కోటి రూపాయలతోపాటు ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు పేర్కొంది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన రతన్ లాల్‌ను అమరవీరుడిగా ప్రకటించింది.

ఈశాన్య ఢిల్లీలోని గోకుల్‌పురిలో సోమవారం సీఏఏకు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. అక్కడే విధులు నిర్వహిస్తున్న రతన్ లాల్ ఆందోళనకారులు జరిపిన దాడిలో మృతి చెందారు. బుల్లెట్ గాయం వల్లే రతన్ లాల్ చనిపోయాడని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.

ఈ నేపథ్యంలోనే రతన్ లాల్‌ను అమరవీరుడిగా ప్రకటించాలంటూ ఆయన కుటుంబసభ్యులు మంగళవారం డిమాండ్ చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అతని కుటుంబానికి ఆర్థిక సాయం అందించడంతోపాటు ఆతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది.

Latest Updates