పెరిగిన ALTO K10 ధర

దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తన హ్యాచ్‌ బ్యాక్‌‌‌‌ మోడల్‌‌‌‌ ‘ఆల్టో కే10’కు మరిన్ని భద్రతా సదుపాయాలను జోడించి ధర కూడా పెంచింది. ఢిల్లీలో మోడల్‌‌‌‌ ధర బట్టి పెరుగుదల రూ.26వేల వరకు ఉంటుందని తెలిపింది. ఇక నుంచి ఈ కారు ఏబీఎస్‌‌‌‌ (యాంటీ లాక్బ్రేకిం గ్‌ సిస్టమ్‌ ), ఈబీడీ (ఎలక్ట్రానిక్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌‌‌‌), డ్రైవర్‌‌‌‌ ఏర్‌‌‌‌బ్యా గ్‌ , రివర్స్పార్కింగ్‌ సెన్సర్‌‌‌‌, సీడ్‌‌‌‌ అలెర్ట్‌‌‌‌ సిస్ట మ్‌ , సీట్‌ బెల్ట్‌‌‌‌ రిమైండర్‌‌‌‌ వంటి ఫీచర్లతో వస్తుంది. అందుకే ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ స్టాక్‌‌‌‌ ఎక్స్‌‌‌‌చేంజ్‌‌‌‌లకు తెలిపింది. ఢిల్లీలో దీని ఎక్స్‌‌‌‌ షోరూం ధర రూ.3 లక్షల 65 వేల నుంచి రూ.4 లక్షల 44 వేల వరకు ఉంది. ఇతర ప్రాంతాల్లో ఇవి రూ.3.75 లక్షల నుంచి రూ.4 లక్షల 54 వేల వరకు ఉన్నాయి. పెంచిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని మారుతీ సుజుకీ ప్రకటించింది.

Latest Updates