మారుతీరావు ఆత్మహత్యకు మూడు రోజుల ముందే ప్లాన్

కూతురు వేరే కులం యువకుడిని పెళ్లి చేసుకుందని.. అల్లుడిపై పరువు హత్యకు పాల్పడిన మారుతీరావు విషంతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్య విషయంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శనివారం ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో అద్దెకు దిగిన మారుతీరావు.. ఆత్మహత్య చేసుకోవాలని మూడు రోజుల ముందు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం తన స్నేహితుడి ఫర్టిలైజర్ షాపు నుంచి పురుగుల మందు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కూతురు అమృతను కేసు విషయంలో రాజీపడాలని మూడు నెలల నుంచి అడ్వకేట్లతో మంతనాలు చేయిస్తున్నారు. అయితే అమృత మాత్రం తండ్రి మాట వినకపోవడంతో.. డిప్రెషన్‌లోకి వెళ్లాడు. అమృతను ఎలాగైనా కలవాలని మిర్యాలగూడకు చెందిన వారితో కూడా రాయబారం పంపాడు. కానీ, అమృత మాత్రం ఏమాత్రం మెట్టు దిగలేదు. దాంతో కూతురు ఇక తన మాట వినదని నిర్ణయించుకోని ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. మారుతీరావు ఉపయోగించిన గ్లాస్‌ను పోలీసులు సీజ్ చేశారు.

For More News..

మారుతీరావు సూసైడ్‌నోట్‌లో ఏముంది?

కల్యాణలక్ష్మీ పథకానికి భారీగా నిధులు

Latest Updates