ఫెస్టివల్ ఆఫర్ : మారుతి బాలెనొపై రూ.లక్ష తగ్గింపు

కార్ల సేల్స్ పెంచుకోవడానికి ఆటోమొబైల్ సంస్థలు ఆఫర్లతో పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే మారుతి సుజుకీ కస్టమర్లను ఆకట్టుకునే బంపర్ ఆఫర్ అనౌన్స్ చేసింది. రెండు రోజుల కింద మారుతి మోడళ్లపై రూ.5వేలు తగ్గించిన సంస్థ.. ఇప్పుడు భారీగా రేటు తగ్గించి మార్కెట్లో హాట్ టాపిక్ అయ్యింది.

బాలెనో RS మోడల్ పై రూ.లక్ష తగ్గించినట్లు BSE ఫైలింగ్ లో తెలిపింది మారుతి సుజుకీ. కార్ల సేల్స్ విఫరీతంగా పడిపోవడంతో సేల్స్ ను పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఇప్పటికే అన్ని మోడళ్లపై ధర తగ్గించిన మారుతి.. పలు ప్రమోషనల్ ఆఫర్లు కూడా అనౌన్స్ చేసింది.

దసరా నవరాత్రులు, దీపావళి పండుగ సీజన్ లోనూ ధరలు తగ్గించేలా కంపెనీ ప్లాన్ చేస్తున్నట్లు మార్కెట్లు వర్గాలు చెబుతున్నాయి. మారుతి సుజుకీ తీసుకున్న ఈ నిర్ణయంతో.. ఇతర సంస్థలు కూడా పోటీపడి కార్ల ధరలు తగ్గించడం ఖాయం అంటున్నారు. మొత్తానికి ఈ దసరా, దీపావళికి కారు కొనుక్కునేవారికి ఇది శుభ పరిణామం అంటున్నారు వ్యాపారులు.

Latest Updates