మారుతి సుజుకి కార్ల ధరల్లో స్వల్ప మార్పు

న్యూఢిల్లీ: కార్ల ధరలను పెంచుతున్నట్లు తెలిపింది మారుతి సుజుకి ఇండియా. అన్నిమోడళ్లర్లపై రూ. 689  (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)  వరకు పెంచుతున్నట్లు మంగళవారం అనౌన్స్ చేసింది. కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని.. హై సెక్యూరిటీ ప్లేట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ  ప్రభుత్వం మాండేటరీ చేసిన క్రమంలో  ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది మారుతి.  ఏప్రిల్‌ 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరంటూ గతంలో ప్రభుత్వం ఆదేశించినా కూడా..వాహనదారుల నుంచి  ఆసక్తి కరువవ్వడంతో  దీనిపై రవాణాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై షోరూమ్ నుంచి బయటకొచ్చే ప్రతి వాహనానికి షోరూముల్లోనే తప్పనిసరిగా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు  బిగించాలని రవాణా శాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు.

వాహనాలకు సంబంధించిన టెక్నికల్ వివరాలతోపాటు.. వాహన యజమానుల వివరాలు పొందుపరిచేలా బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటచేసుకోవాలని ఇదివరకే షోరూమ్ నిర్వాహకులను ఆదేశించారు. ఇదే తరహాలో హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల విషయంలోనూ పాటించాలని నిబంధనలు విధించారు. దీంతో కార్ల ధరలను పెంచకతప్పడంలేదని వివరించింది మారుతి.

Latest Updates