ముప్పైకి పైగా నగరాల్లో మారుతీ స్మార్ట్ ఫైనాన్స్

  • అరేనా డీలర్‌‌‌‌షిప్స్‌‌లో అందుబాటు
  • కారు కొనుగోలు ఈజీ

న్యూఢిల్లీ: మారుతీ సుజుకి ఇండియా 30కి పైగా సిటీల్లో ఉన్న తన అరేనా డీలర్‌‌‌‌షిప్స్‌‌లో ఆన్‌‌లైన్ ఫైనాన్సింగ్ ప్లాట్‌‌ఫామ్‌‌ను తీసుకొచ్చింది. స్మార్ట్‌‌ ఫైనాన్స్ ప్లాట్‌‌ఫామ్‌‌ను లాంచ్‌‌ చేసింది. దీంతో కస్టమర్ కారు కొనుగోలు చేసే ప్రాసెస్‌‌లో చేపట్టే 26 ప్రొసీజర్స్‌‌లో 24 స్టెప్స్‌‌ను మారుతీ సుజుకి డిజిటైజ్ చేసింది. కస్టమర్లకు ఎక్కడ తక్కువకు లోన్ దొరుకుతుంది, వాటిల్లో వడ్డీరేట్లు, ఫైనాన్స్‌‌కు సంబంధించిన అన్ని ఫార్మాలిటీలను పూర్తిచేయడం, ఎలాంటి రిస్క్ లేకుండా కొన్ని క్లిక్స్‌‌తోనే లోన్‌‌ను జారీ చేయడం వంటి వాటిని ఈ డిజిటల్ ప్లాట్‌‌ఫామ్ ద్వారా మారుతీ సుజుకి ఆఫర్ చేస్తుంది. కంపెనీ వెబ్‌‌సైట్ ఇటు కస్టమర్‌‌‌‌కు, అటు ఫైనాన్సియర్‌‌‌‌కు మధ్యవర్తిగా ఉంటుంది. దీని ద్వారా పారదర్శకమైన ఫైనాన్సింగ్ సొల్యూషన్స్‌‌ను అందించనున్నామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం మారుతీ సుజుకి ఎస్‌‌బీఐ, హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్, మహీంద్రా ఫైనాన్స్, ఇండస్‌‌ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కొటక్ మహీంద్రా వంటి 12 ఫైనాన్సియల్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తమ నెక్సా కస్టమర్ల నుంచి స్మార్ట్ ఫైనాన్స్ ప్లాట్‌‌ఫామ్‌‌కు మంచి స్పందన వచ్చిందని మారుతీ సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ కరోనా మహమ్మారి పరిస్థితుల్లో కంపెనీ తన డిజిటల్ ప్లాట్‌‌ఫామ్స్‌‌ను మరింత పెంచుతుందని తెలిపింది. స్మార్ట్ ఫైనాన్స్ సర్వీసు ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, ఎన్‌‌సీఆర్, జైపూర్, బెంగళూరు వంటి 30కి పైగా సిటీల్లో అరేనా కస్టమర్లకు అందుబాటులో ఉందని కంపెనీ చెప్పింది.

ఇవీ చదవండి

పోషక విలువలున్నాయని ఎక్కువగా తింటే..

జూనియర్ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్: సామియా @ వరల్డ్‌ నెంబర్-2

నెట్ బౌలర్‌గా వెళ్లి 3 ఫార్మాట్లలో అరంగేట్రం

లాండ్​లైన్​ నుంచి మొబైల్​కు కాల్​ చేయాలంటే ఇలా చేయాల్సిందే!

Latest Updates