మారుతీ నుంచి మరో 3 వేల ఉద్యోగులు ఔట్

maruti-suzuki-cuts-3000-contract-jobs

కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు మరోసారి బ్యాడ్ న్యూస్ చెప్పింది. మారుతీ కార్ల డిమాండ్ రోజు రోజుకి తగ్గడంతో మరింతమంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీలో 3వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల ఒప్పందాలను పొడిగించడంలేదని తెలిపింది. మార్కెట్లో కార్ల డిమాండ్ తగ్గడంతో మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. భారత్ లో ఆటోమొబైల్ సేల్స్ ఆగస్టు నెల కూడా అంతంతగానే ఉందని..ఈ క్రమంలోనే ఎంప్లాయూస్ ను తొలగించే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది మారుతీ సుజుకీ.

కార్లలో సేఫ్టీ రూల్స్ , భారీగా పన్నులు పెరగడం వంటి అంశాలు  ధరలు, నిర్వహణ భారం పెరిగేలా చేస్తున్నాయని కంపెనీ ఛైర్మన్‌ ఆర్‌.సి.భార్గవ తెలిపారు.

Latest Updates