మారుతీ కార్ల తయారీ తగ్గింది

దేశంలోని అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌‌ఐ) వరుసగా ఐదో నెల అయిన జూన్‌‌లోనూ ప్రొడక్షన్‌‌కు కోత పెట్టింది. సూపర్‌‌ క్యారీ ఎల్సీవీ సహా అన్ని వాహనాల ప్రొడక్షన్‌‌ను 15.6 శాతం తగ్గించి 1.11 లక్షల యూనిట్లకు పరిమితం చేసింది. 2018 జూన్‌‌లో 1.32 లక్షల యూనిట్లను తయారు చేసింది. ప్యాసింజర్‌‌ వాహనాల ఉత్పత్తిని 16.34 శాతం తగ్గించి 1.10 లక్షల యూనిట్లకు పరిమితం చేసింది. గత ఏడాది జూన్‌‌లో 1.31 లక్షల యూనిట్లను తయారు చేసింది. ఆల్టో వంటి మినీ సెగ్మెంట్‌‌ వాహనాల ఉత్పత్తిని 48.2 శాతం తగ్గించి 15,087 యూనిట్లకు పరిమితం చేసింది. గత ఏడాది జూన్‌‌లో 29,131 యూనిట్లను తయారు చేసింది. వేగన్‌‌ ఆర్‌‌, స్విఫ్ట్‌‌, డిజైర్‌‌ వాహనాల ఉత్పత్తిని 1.46 శాతం తగ్గించి 66,436  యూనిట్లకు పరిమితం చేసింది. గత ఏడాది జూన్‌‌లో 67,426 యూనిట్లను తయారు చేసింది.  యుటిలిటీ వెహికిల్స్‌‌ ఉత్పత్తిని 5.26 శాతం తగ్గించి 17,074  యూనిట్లకు కుదించుకుంది. గత ఏడాది జూన్‌‌లో 18,023  యూనిట్లను తయారు చేసింది. ఇక వ్యాన్ల ఉత్పత్తిని 27.87 శాతం తగ్గించి 8,501 యూనిట్లకు పరిమితం చేసింది. గత ఏడాది జూన్‌‌లో 11,787  యూనిట్లను తయారు చేసింది. ఇక మేలో వాహన ఉత్పత్తిని 18 శాతం తగ్గించింది. ఏప్రిల్‌‌లో  10 శాతం ఉత్పత్తి , మార్చిలో 20.9 శాతం, ఫిబ్రవరిలో ఎనిమిది శాతం తగ్గించింది. మహీంద్రా, టాటా మోటార్స్‌‌ కూడా తయారీని తగ్గించాయి. ఈ ఏడాది మేలో ప్యాసింజర్‌‌ వెహికిల్స్ అమ్మకాలు 18 ఏళ్ల కనిష్టస్థాయికి చేరాయి. రిటైల్‌‌ అమ్మకాలు ఏకంగా 20 శాతం తగ్గాయి. గత ఏడాది అక్టోబరులో మాత్రమే 1.55 శాతం పెరిగాయి.

Latest Updates