మారుతీ విక్రయాలు డౌన్

Maruti Suzuki reports 17% drop in April sales; analyst outlook weak

17.2 శాతం తగ్గిన ఏప్రిల్ అమ్మకాలు

న్యూఢిల్లీ :దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి విక్రయాలు ఏప్రిల్ నెలలో 17.2 శాతం తగ్గి 1,43,245 యూనిట్లుగా రికార్డైనట్టు కంపెనీ వెల్లడించింది. గతేడాది ఏప్రిల్ నెలలో 1,72,986 యూనిట్ల విక్రయాలు చేపట్టినట్టు మారుతీ సుజుకి ఇండియా(ఎంఎస్‌‌‌‌ఐ) పేర్కొంది. దేశీయ విక్రయాలు 18.7 శాతం తగ్గి 1,34,068 యూనిట్లగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో ఈ విక్రయాలు 1,64,978 యూనిట్లు. ఆల్టో లాంటి మినీ కార్ల సేల్స్ గతేడాది 37,794 యూనిట్లుంటే, ఈ ఏడాది 22,766 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. అంటే వీటి విక్రయాలు ఏకంగా 39.8 శాతం మేర తగ్గాయి. స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ లాంటి కాంపాక్ట్ సెగ్మెంట్ విక్రయాలు 13.9 శాతం తగ్గి 72,146 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయినట్టు కంపెనీ పేర్కొంది. మిడ్‌‌‌‌ సైజు సెడాన్ సియాజ్ 2,789 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది.

ఇది గతేడాది 5,116 యూనిట్లు అమ్ముడుపోయింది. విటరా బ్రిజా, ఎస్‌‌‌‌ క్రాస్, ఎర్టిగా వంటి యుటిలిటీ వెహికిల్స్ విక్రయాలు మాత్రం 5.9 శాతం పెరిగి 22,035 యూనిట్లుగా ఉన్నాయని మారుతీ సుజుకి తెలిపింది. మారుతీ సుజుకి ఎగుమతులు కూడా ఏప్రిల్ నెలలో 14.6 శాతం పెరిగి 9,177 యూనిట్లుగా రికార్డయ్యాయి. గతేడాది ఇదే నెలలో ఈ ఎగుమతులు 8,008 యూనిట్లు మాత్రమే.

హోండా సేల్స్ 23 శాతం అప్

న్యూఢిల్లీ : హోండా కార్స్ ఇండియా లిమిటెడ్(హెచ్‌‌‌‌సీఐఎల్‌‌‌‌) దేశీయ అమ్మకాలు ఏప్రిల్ నెలలో 23 శాతం పెరిగి 11,272 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో హోండా దేశీయ సేల్స్ 9,143 యూనిట్లు మాత్రమే.  లోయర్ బేస్ ఎఫెక్ట్‌‌‌‌తో ఏప్రిల్ నెల విక్రయాలు పెరిగినట్టు కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ రాజేశ్ గోయల్ చెప్పారు. మరోవైపు అమేజ్ విక్రయాలు కూడా హోండాకు సహకరించాయి. హోండా అమేజ్‌‌‌‌ ఇండియాలో రెండవ బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ సెడాన్‌‌‌‌గా నిలిచింది. హ్యుందాయ్ ఎక్స్‌‌‌‌సెంట్, టాటా టిగోర్‌‌‌‌‌‌‌‌ను దాటేసి ఈ స్థానానికి వచ్చింది.అయితే లోక్‌‌‌‌సభ ఎన్నికలు, స్తబ్దుగా ఉన్న మార్కెట్ సెంటిమెంట్ అమ్మకాలపై ప్రభావం చూపనున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది చాలా క్లిష్టమైనదని.. ఇంధన ధరల్లో అనిశ్చిత, కొత్త రెగ్యులేషన్స్‌‌‌‌తో ధరల పెరుగుదల, ఏడాది చివరికి బీఎస్‌‌‌‌ 6 నిబంధనలు.. ఇవన్నీ ప్రభావం చూపనున్నాయని గోయల్ చెప్పారు.

Latest Updates