మారుతి సుజుకి డీజిల్ కార్ల అమ్మకం బంద్

Maruti Suzuki to phase out all diesel cars by April 2020

ఆటో మొబైల్​ పరిశ్రమ కొత్తశకం వైపుకి మరలుతోందా…? ఇండియాలో డీజిల్ కార్లు పూర్తిగా జ్ఞాపకంగా మిగలబోతున్నాయా..? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి . ఓవైపు అమల్లోకి రాబోతున్న బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 6ఎమిషన్స్ నిబంధనలు.. మరోవైపు ప్రభుత్వ ప్రోత్సాహంతో ఎలక్ట్రిక్వెహికిల్స్.. వీటన్నింటికీ మించి డీజిల్, పెట్రోల్ధరల మధ్య వ్యత్యాసం భారీగా తగ్గిపోవడం… ఇవన్నీ కలిపి ఇండియన్ ఆటో మొబైల్ పరిశ్రమనుడీజిల్ కార్ల నుంచి దృష్టి మళ్లేలా చేస్తున్నాయి . మార్కెట్ లీడర్ మారుతీసుజుకీ డీజిల్ కార్ల అమ్మకాలు ఆపివేయాలనే నిర్ణయాన్ని గురువారం ప్రకటించింది. గత కొన్నేళ్లుగా తగ్గుతూ వస్తోన్న డీజిల్ కార్ల అమ్మకాలు ఇదే విషయాన్ని ప్రతిబింబిస్తున్నాయి . మారుతీ బాటలోనే మరికొన్ని కంపెనీలు కూడా నడిచే అవకాశం ఉందని ఇండస్ట్రీవర్గాలు చెబుతున్నాయి .

మారుతీ సుజుకీ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అన్ని డీజిల్ కార్లను పూర్తిగా ఆపివేయాలని, అమ్మకాలు నిర్వహించకూడదని నిర్ణయించింది. 2020 ఏప్రిల్1 నుంచి డీజిల్ కార్ల అమ్మకాలు పూర్తిగా ఆపివేస్తున్నట్టు మారుతీ సుజుకి ఇండియా చైర్మన్ ఆర్‌సీ భార్గవ చెప్పారు. గురువారం విడుదల చేసిన క్యూ4 ఫలితాల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. మారుతీమార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశీయమార్కెట్‌‌‌‌లో మొత్తం 17.53 లక్షల యూనిట్ల కార్లను అమ్మింది. గతేడాది కంటే ఇది 6.1 శాతం వృద్ధి. వార్షిక విక్రయాల్లో సుమారు 23 శాతం డీజిల్ కార్లవే ఉన్నాయి. అంటే 4,63,000 యూనిట్లు వీటివే. కానీ డీజిల్ కార్ల అమ్మకాలు పూర్తిగా ఆపివేసి, కొనుగోలుదారుల్ని ప్రోత్సహకాల ద్వారా పెట్రోల్ లేదాసీఎన్‌ జీ కార్లకు షిఫ్ట్ అయ్యేలా చూడాలని మారుతీ భావిస్తోంది.

ప్రస్తుతం ఎక్కువ మోడల్స్‌ లో సీఎన్‌ జీ ఆప్షన్లను అందిస్తోంది. ఐదేళ్ల క్రితం రెండు కార్లు అమ్ముడుపోతే, వాటిలో ఒకటి డీజిల్ వెహికిలే ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితి అంతా మారిపోయింది. నాలుగు కార్లు అమ్ముడుపోతే, వాటిలో కేవలం ఒక్కటే డీజిల్ కారు ఉంటోంది. అంటే ఏమేర డీజిల్ కార్ల అమ్మకాలు పడిపోయాయో అర్థం చేసుకోవచ్చు. కేవలం సెడాన్లు, కాంపాక్ట్ కార్లలోనే కాక, ఎస్‌‌‌‌యూవీ కేటగిరీ వెహికిల్స్‌ పై కూడా ఈ ప్రభావం పడుతోంది. సాధారణంగా ఎస్‌‌‌‌యూవీ కేటగిరీలోడీజిల్ వేరియంట్ వాటా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎస్‌‌‌‌యూవీ అమ్మకాల్లో పెట్రోల్ వెహికిల్స్షేరు ఎక్కువగా పెరుగుతోంది.

దీనికి ఉదాహరణ…క్రెటా ఎస్‌‌‌‌యూవీ సేల్స్‌ లో 30 శాతానికి కంటే ఎక్కువ అమ్మకాలు పెట్రోల్ వెర్షన్‌ నుంచే నమోదయ్యాయి. మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ సియాజ్ సెడాన్‌అమ్మకాల్లో 30 శాతమే డీజిల్ వేరియంట్‌‌‌‌కు దక్కుతోంది. ఒకప్పుడు ఈ వేరియంట్‌‌‌‌కు 60 శాతంవరకు అమ్మకాలు ఉండేవి. కానీ మారుతీ విషయంలో ఇప్పటికీ డీజిల్ వేరియంట్స్‌ కు డిమాండ్ స్ట్రాంగ్​గా ఉంటోందని… విటారా బ్రెజా, ఎస్‌‌‌‌ క్రాస్ లాంటి కొన్నిమోడల్స్‌ కు పెట్రోల్ వేరియంట్ లేకపోవడం కూడావీటికి దోహదం చేస్తోందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. డీజిల్ కార్ల అమ్మకాలను ఆపివేయడంతో ఎక్కువ అమ్ముడుపోయే ఎర్టిగా, విటారా బ్రెజా,ఎస్‌‌‌‌ క్రాస్ మోడల్స్ ప్రభావితం కానున్నాయి. స్విఫ్ట్ ,బాలెనో, డిజైర్, సియాజ్, ఎర్టిగాలలో డీజిల్‌ తో పాటుపెట్రోల్ వెర్షన్లను ఆఫర్ చేస్తోంది.

50 శాతం నుంచి 23 శాతానికితగ్గిన డీజిల్ కార్ల వాటా..
చాలా నగరాల్లో డీజిల్ తో నడిచే ట్యాక్సీ లకు అనుమతిలేదు. కేవలం పెట్రోల్, లేదా సీఎన్‌ జీ వెహికిల్స్‌ కేఅనుమతి ఉంటోంది. దాంతో పాటు డీజిల్ కార్ల ధర ఎక్కువ ఉండటం కూడా వీటి డిమాండ్‌ పై ప్రభావంచూపుతోంది. సియామ్ డేటా ప్రకారం.. కారు అమ్మకాల్లో డీజిల్ కార్ల వాటా 2012–13లో 47 శాతం ఉంటే.. ఇది ఇప్పుడు 23 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో పెట్రోల్​ కార్ల వాటా 77 శాతంపెరిగింది. 2020 నుంచి కొత్త ఎమిషన్స్ నిబంధనలు బీఎస్‌‌‌‌ 6 అమల్లోకి వస్తే, డీజిల్ కార్ల ధరలు మరింత పెరగనున్నాయి. దీంతో వీటి అమ్మకాలు మరింత పడనున్నాయి.

తగ్గిన మారుతీ లాభాలు…
ఆటో పరిశ్రమ వ్యాప్తంగా డిమాండ్ బలహీనంగా ఉండటంతో, మార్చి 31తో ముగిసిన నాలుగో క్వార్టర్ లో మారుతీ సుజుకి లాభాలు తగ్గాయి. ఈ ఆటో తయారీదారి నికర లాభాలు 4.6 శాతం తగ్గి రూ.1,795.6 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఈ లాభాలు రూ.1,882.1కోట్లుగా ఉన్నట్టు కంపెనీ తన ఫైలింగ్ లోపేర్కొంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్లు, కమోడి టీధరలు, సేల్స్ ప్రమోషన్ ఖర్చులు ఎక్కువుండటం వంటివి ఈ క్వార్టర్ లో తమకు ప్రతికూలంగా నిలిచాయని మారుతీ సుజుకి చెప్పింది. ఈక్వార్టర్ లో నికర అమ్మకాలు రూ.20,737.5కోట్లకు పెరిగాయి. క్వార్టర్ రివ్యూలో మొత్తంకారు అమ్మకాలు స్వల్పంగా తగ్గి 4,58,479యూనిట్లుగా రికార్డైనట్టు ప్రకటించింది.2018–19 పూర్తి ఏడాదికి మారుతీ సుజుకినికర లాభాలు 2.9 శాతం తగ్గి రూ.7,500.6కోట్లుగా ఉన్నాయి. నికర అమ్మకాలు 6.3శాతం పెరిగి రూ.83,026.5 కోట్లుగా రికార్డయ్యా యి. 2018–19 ఆర్థిక సంవత్సరంలోఒక్కో షేరుకు రూ.80 డివిడెండ్ ఇవ్వాలనికంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ప్రతిపాదించారు.

Latest Updates